మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌కి రంగం సిద్థం చేస్తున్న దిల్‌రాజు

మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌కి రంగం సిద్థం చేస్తున్న దిల్‌రాజు

సీత‌మ్మ వాటిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాతో – మ‌ల్టీస్టార‌ర్ సంప్ర‌దాయానికి తెర లేపారు దిల్‌రాజు. ఆ త‌ర‌వాత టాలీవుడ్‌లో చాలా మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలొచ్చాయి. ఎఫ్ 2తో మ‌రోసారి ఇద్ద‌రు హీరోల్ని క‌లిపారు దిల్ రాజు. ఆ సినిమా వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌లోనే అత్య‌ధిక లాభాల్ని తీసుకొచ్చిన చిత్రంగా మిగిలింది. ఇప్పుడు ఆయ‌న మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌కి రంగం సిద్థం చేస్తున్నారు. ఈసారి మెగా మ‌ల్టీస్టార‌ర్‌కి ప్లాన్ చేశాడు దిల్ రాజు. వ‌రుణ్‌తేజ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌ల కోసం ఓ క‌థ సిద్ధ‌మైంద‌ని, త్వ‌ర‌లోనే ఈ సినిమాని ప‌ట్టాలెక్కించే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.

`ఎవ‌రు` సినిమాతో ఆక‌ట్టుకున్న వెంక‌ట్ రాంజీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. అయితే ఇటు వ‌రుణ్‌, అటు సాయిధ‌ర‌మ్ తేజ్ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. వాళ్లిద్ద‌రి కాల్షీట్లూ కంబైంన్డ్‌గా దొరికిన‌ప్పుడు ఈ సినిమా ప‌ట్టాలెక్కుతుంది. ఈలోగా క‌థ‌ని పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకునే ప‌నిలో ఉన్నాడు రామ్‌జీ. ఇద్ద‌రు హీరోలు, అందునా మెగా హీరోలు క‌లిస్తే.. ఆ లెక్కే వేరుగా ఉంటుంది. మ‌రి ఈ మ‌ల్టీస్టార‌ర్ ఏ స్థాయిలో ఉండ‌బోతోందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.