టాలీవుడ్లో ప్రస్తుతం ఉన్న నిర్మాతల్లో అత్యధిక సక్సెస్ రేటు ఉన్న నిర్మాత ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు దిల్‌రాజు. ఈయన ఎన్నో చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసి, ఆ తర్వాత నిర్మాతగా మారాడు. సినిమాల నిర్మాణం విషయంలో దిల్‌రాజు చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. కథ ఎంపిక నుండి ఆ కథకు దర్శకుడు, నటీనటుల ఎంపిక విషయంలో ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తుంటాడు. అందుకే దిల్‌రాజు ఎక్కువగా సక్సెస్‌లను కలిగి ఉన్నాడు. కొందరు నిర్మాతలు మొత్తం దర్శకుడిపై భారం వేస్తూ ఉంటారు. కాని దిల్‌రాజు మాత్రం అలా కాదు. తాను ఏదైనా సినిమా నిర్మిస్తూ ఉన్నాడు అంటే ఖచ్చితంగా అన్ని విభాగాల్లో తన హ్యాండ్ ఉంటుంది. అలాంటి దిల్‌రాజు ఈ మద్య కాలంలో కాస్త సక్సెస్ రేటు తగ్గుతుంది.
గత సంవత్సరం డబుల్ హ్యాట్రిక్‌ను దక్కించుకున్న దిల్‌రాజు టీం ఈ సంవత్సరం కాస్త ఆలస్యంగా జర్నీని ప్రారంభించారు. ఇప్పటికే రెండు సినిమాలు ఈబ్యానర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ ముందు బొక్క బోర్లా పడ్డాయి. రాజ్ తరుణ్ నటించిన ‘లవర్’ చిత్రంతో పాటు నితిన్ నటించిన శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడంలో విఫలం అయ్యాయి. ముఖ్యంగా నితిన్‌తో నిర్మించిన శ్రీనివాస కళ్యాణం చిత్రం విషయంలో దిల్‌రాజు చాలా ఆశలు పెట్టుకున్నాడు. కాని ఆశలు అన్ని కూడా అడియాశలు అయ్యాయి. సినిమా చిత్రీకరణ సమయంలో దర్శకుడిని పూర్తిగా నమ్మేసిన దిల్‌రాజు కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్‌తో కనిపించాడు. దర్శకుడిని ఎక్కువగా విశ్వసించడంతో సినిమా ఫలితం తారుమారు అయ్యింది. ఇకపై అయినా దిల్‌రాజు మళ్లీ మునుపటి రీతిలో సినిమాలను నిర్మిస్తే మంచిదని, లేదంటే మాత్రం ఇతర నిర్మాతల మాదిరిగానే ఈయన కూడా ఒకప్పటి నిర్మాతగా మారిపోతాడు అంటూ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.