ప్రకాష్‌ రాజ్‌ మంచి మనస్సు… అందరికి వర్తిస్తే బాగుండేది

Dil Raju says about Prakash Raj Remuneration

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం సీనియర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టు అంటే అంతా కూడా ప్రకాష్‌ రాజ్‌ వైపే చూస్తారు. స్టార్‌ హీరోలకు తండ్రిగా నటించాలన్నా లేదంటే ఏదైనా ముఖ్యమైన పాత్రలో నటించాలన్నా కూడా ప్రకాష్‌ రాజ్‌ను స్టార్‌ దర్శకులు ఆశ్రయిస్తున్నారు. మోస్ట్‌ వాంటెడ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టు అయిన ప్రకాష్‌ రాజ్‌ చాలా ఖరీదైన క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా కొనసాగుతూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈయన ఏ చిత్రం చేసినా కూడా ఆ చిత్రం షూటింగ్‌లో పాల్గొనేందుకు రోజుకు అయిదు నుండి ఆరు లక్షల వరకు తీసుకుంటాడు. ఎక్కువ రోజుల డేట్లు ఉంటే 5 లక్షలు వారం లేదా రెండు వారాలు మాత్రమే ఉంటే మాత్రం 6 లక్షల వరకు తీసుకుంటాడు. కాని తాజాగా దిల్‌రాజు నిర్మించిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంలో నటించినందుకు రోజుకు మూడు లక్షల చొప్పున మాత్రమే తీసుకున్నాడు.

దిల్‌రాజు ఒక మంచి నిర్మాత అని, ఆయన తీసే సినిమాలు అన్ని కూడా తనకు మంచి పేరును తీసుకు వస్తున్నాయనే ఉద్దేశ్యంతో తాను దిల్‌రాజు చేస్తున్న సినిమాలకు పారితోషికం విషయంలో మినహాయింపు ఇస్తాను అంటూ ప్రకాష్‌ రాజ్‌ సన్నిహితులతో చెబుతూ ఉంటాడు. తాజాగా దిల్‌రాజు కూడా శ్రీనివాస కళ్యాణం చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ ప్రకాష్‌ రాజ్‌ ఈ చిత్రం కోసం చాలా తక్కువ పారితోషికం తీసుకున్నాడు. ఆయన పాత్రను నచ్చి చేశాడు. ఇలాంటి పాత్రను తనకు ఇచ్చినందుకు దర్శకుడు సతీష్‌ వేగేశ్నకు కూడా ప్రకాష్‌ రాజ్‌ కృతజ్ఞతలు చెప్పినట్లుగా తెలుస్తోంది. శతమానం భవతి చిత్రంలో పెద్దాయన పాత్ర మాదిరిగానే ఈ చిత్రంలో కూడా ప్రకాష్‌ రాజ్‌ పాత్ర ఉంటుందని సమాచారం అందుతుంది. మంచి పాత్ర అయిన పారితోషికం తగ్గించుకున్న ప్రకాష్‌ రాజ్‌ ఇతర చిత్రాల్లో నటించేప్పుడు కూడా కాస్త పారితోషికం అటు ఇటుగా తీసుకుంటే బాగుంటుంది కదా అంటూ కొందరు అంటున్నారు. గతంలో ఒక నిర్మాత పారితోషికం ఇవ్వలేదు అంటూ ప్రకాష్‌ రాజ్‌ ఫిర్యాదు చేయడం, అది కాస్త సీరియస్‌ అవ్వడం జరిగిన విషయం తెల్సిందే.