వల్లభనేని అశోక్ పై దిల్ రాజ్ కామెంట్స్…!

Dil Raju Strong Counter To Ashok Vallabhaneni Comments

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేటా సినిమాకు తెలుగులో థియేటర్స్ దొరకని పరిస్థితి ఇప్పుడు ఎదురైంది. ఈ చిత్రాని తెలుగు వెర్షన్ లో రిలీజ్ చేస్తున్న వల్లభనేని అశోక్ టాలీవుడ్ అగ్రనిర్మాతలైన అల్లు అరవింద్, దిల్ రాజ్ యువి క్రియేషన్స్ పై అయన పేటా ట్రైలర్ విడుదల ఫంక్షన్ లో వారిపై హాట్ కామెంట్స్ చేశాడు. ఈ విషయంపై అల్లు అరవింద్ దగ్గర పనిచేస్తున్న పిఆర్ఓ కం నిర్మాత అయినా ఎస్కేఎన్ స్పందించాడు. తాజాగా ఇదే విషయంపై దిల్ రాజ్ కూడా నిన్న జరిగిన ఎఫ్2 ఆడియో ఫంక్షన్ లో ఆ విషయంపై మాట్లాడుతూ….. వల్లభనేని అశోక్ కొంచెం ఘాటుగానే మాట్లాడాడు. తెలుగు సినిమాలకె థియేటర్స్ దొరికే పరిస్థితి లేదు. అలాంటిది డబ్బింగ్ సినిమాకు థియేటర్స్ దొరకడం అనేది చాలా కష్టం.

సంక్రాంతికి విడుదలవుతున్న ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ రామ, ఎఫ్2 సినిమాలు ఎప్పుడో బుక్ చేసుకుని పెట్టుకున్నాయి. ఈ విషయం తెలవకుండా మాట్లాడటం మంచిది కాదు అన్నారు. అశోక్ చెప్పినట్లుగా ఈ నెల 18నుండి మాత్రమే పూర్తి స్థాయిలో పేటా సినిమా ఉంటుంది అంటున్నాడు మరి ఆ రోజే సినిమాను విడుదల చేసుకుంటే సరిపోతుది. ఎందుకు పోటి పడి ముందే విడుదల చెయ్యడం అన్నాడు. నిర్మాతగా సినిమా ఇండస్ట్రిలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాను. గత సంవత్సరం సినిమా దిస్తిబుటర్ గా ఉండి ఎంతో లాస్ అయ్యాను అన్నారు. దిల్ రాజునూ, అల్లు అరవింద్ ను ఉద్దేశించి వల్లభనేని అశోక్ కుక్కలు అనడం, వాళ్ళను నయుం ఎన్కౌంటర్ చేసినట్లుగా ఎన్కౌంటర్ చెయ్యడం అనేది పెద్ద దూమారం గా మారింది. ఇంకా ఈ విషయంపై అల్లు అరవింద్ మాత్రం ఇంకా ఏవిధంగా స్పందించలేదు.