‘ప్రేమమ్’ చిత్రంతో సౌత్ ఇండియా మొత్తం ప్రేక్షకులను సాయి పల్లవి తనవైపుకు తిప్పుకుంది. ఆ చిత్రంలో సాయి పల్లవి నటనకు అంతా కూడా ఫిదా అయ్యారు. ఆమెకు తెలుగులో మంచి ఫ్యూచర్ ఉంటుందని, తప్పకుండా తెలుగు ప్రేక్షకులు ఆమెను ఆధరిస్తారనే నమ్మకంతో ‘ఫిదా’ చిత్రంలో ఆమెను హీరోయిన్‌గా దిల్‌రాజు ఎంపిక చేశాడు. దిల్‌రాజు అంచనా తప్పలేదు. ‘ఫిదా’ చిత్రంతో సాయి పల్లవి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సాయి పల్లవి తర్వాత దిల్‌రాజు ప్రస్తుతం ప్రియా వారియర్‌పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.
మలయాళ చిత్రం ‘ఒరు అదార్ లవ్’లో తన కను చూపుతో, తన హావబావాలతో యువతకు మత్తెక్కించిన ముద్దుగుమ్మ ప్రియా వారియర్‌కు ఒక్కసారిగా భారీ క్రేజ్ వచ్చింది. అందుకే ఆమెకు పలువురు నిర్మాతలు భారీ ఆఫర్లు ఇస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అయిన దిల్‌రాజు ఇప్పటికే ఆమెతో మాట్లాడి భారీ పారితోషికంను ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. దిల్‌రాజుతో పాటు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్‌లు కూడా ప్రియా వారియర్‌తో సినిమాను చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. యూవీ క్రియేషన్స్ తరపున వంశీ మరియు ప్రమోద్‌లు ప్రియా వారియర్‌తో చర్చలు జరిపారట. త్వరలోనే ఈ రెండు బ్యానర్‌లలో ఒక చిత్రంతో ప్రియా వారియర్ నటించే అవకాశం ఉంది. పెద్ద సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రియా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగే అవకాశం ఉంది.