Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
” ఆ నలుగురు” తో సందేశాత్మక చిత్రాల్ని కూడా జనం ఆదరిస్తారని రుజువు చేసిన దర్శకుడు చంద్ర సిద్ధార్థ. ఆ తర్వాత కూడా అదే బాటలో మధుమాసం, అందరి బంధువయా, ఇదీ సంగతి, ఏమో గుర్రం ఎగరా వచ్చు వంటి అర్ధవంతమైన సినిమాలు తీశారు. ఆయన తొలుత డైరెక్ట్ చేసిన అప్పుడప్పుడు సినిమాకి కూడా మంచి పేరు వచ్చింది. మంచి సినిమాలు తీస్తాడని పేరున్నా ఆర్ధికంగా వర్కౌట్ కాకపోవడంతో కొన్నాళ్లుగా చంద్ర సిద్ధార్ధ మెగా ఫోన్ పట్టలేకపోయాడు. కానీ ఇప్పుడు ఓ టాప్ ప్రొడ్యూసర్ అండతో మరో సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నాదు. కన్నడ రంగంతో పాటు దక్షిణాది భాషల్లో భారీ సినిమాలు తీసే రాక్ లైన్ వెంకటేష్ ఈ సారి చంద్రసిద్ధార్ద సినిమాకి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.
ఈ నెల చివర లేదా వచ్చే నెల మొదట్లో ప్రారంభం అయ్యే ఈ సినిమాకి భలే టైటిల్ పెట్టారు. “ఆట కదరా శివా” అనే టైటిల్ తో ఈ సినిమా రానుంది. ఈ టైటిల్ ఎక్కడో విన్నట్టు ఉందా ? . వుంది. అయితే ఇది సినిమా టైటిల్ కాదు. ఈ శీర్షికతో ప్రముఖ రచయిత తనికెళ్ళ భరణి ఆధ్యాత్మిక గీతాలు రాశారు. పుట్టుక, చావు మధ్య జీవితాన్ని ఓ ఆటగా అభివర్ణిస్తూ, ఆ ఆటని శివుడికి ఆపాదిస్తూ తనికెళ్ళ రాసిన ఆ గీతాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. చిత్రసీమలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఇప్పుడు అదే టైటిల్ తో సినిమా చేయాలని భావించిన చంద్రసిద్ధార్ద తణికెళ్లని ఈ టైటిల్ వాడుకుంటామని అడిగితే ఆయన సంతోషంగా ఒప్పుకున్నారట. పైగా ఇదే చరణంతో మిధునంలో ఓ బ్యాక్ గ్రౌండ్ పాటని జేసుదాస్ గారితో పాడించారు. ఆ పాటని వాడుకోడానికి కూడా తనికెళ్ళ ఓకే అనడంతో చంద్రసిద్ధార్ద ఈ సినిమా సగం విజయవంతం అయినట్టే భావిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తారు అన్నది ఇంకా బయటికి రాలేదు.