ఒక సినిమా విడుదలైంది అంటే… ‘ఎలా ఉంది?’ అన్న ఆతృతతో ఆయా సినిమాల ‘రివ్యూ’లు చదవడం ఒకప్పుడు ప్రేక్షకుల వంతు! కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆడియన్స్ ఎదురు చూపుల కంటే కూడా ముందుగా తాము తీసిన సినిమాకు ఎలాంటి రివ్యూ వస్తుందోనని నిరీక్షించడం డైరెక్టర్ల వంతవుతోంది. అవును… ఇది నిజం..! గత కొన్నాళ్లుగా టాలీవుడ్ లో ఇదే జరుగుతోంది. సినిమా విడుదలైన వెంటనే రివ్యూలు రాసే వ్యక్తులపై డైరెక్టర్లు చెలరేగిపోతూ విమర్శలు చేస్తున్న వైనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ‘దువ్వాడ జగన్నాధమ్’ సినిమా విషయంలోనూ డైరెక్టర్ హరీష్ శంకర్ నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోన్న “నేనే రాజు నేనే మంత్రి” సినిమాల రివ్యూల విషయంలోనూ దర్శకుడు తేజ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.
‘మార్నింగ్ షో పడిన తర్వాత సెకండాఫ్ బాలేదన్నారని, నిజానికి సినిమాలో హీరో క్యారెక్టర్ డౌన్ అయ్యింది గానీ కధ డౌన్ కాలేదని, ఇది పట్టుకుంటారా లేదా అని తాను అనుకున్నానని, ఓ నలుగురైదుగురు మాత్రం క్యాచ్ చేసి రాసారని, వారికి తన హ్యాట్సాఫ్ అంటూ చెప్పిన తేజ, మిగిలిన వారిని మాత్రం ఆ దేవుడు కూడా రక్షించలేడు అంటూ ప్రసంగించారు. ఒక్క తేజనే కాదు ప్రస్తుతం ఏ పెద్ద సినిమా విడుదలైనా ముందు ప్రేక్షకుల టాక్ కంటే, రివ్యూలు పాజిటివ్ గా వస్తున్నాయా? నెగటివ్ గా వస్తున్నాయా? అన్నదే ముఖ్యంగా చూస్తున్నారని అర్ధమవుతోంది. పాజిటివ్ గా రాస్తే థాంక్స్ చెప్పడం, నెగటివ్ గా రాస్తే విమర్శలు చేయడం ఈ తరం దర్శకులకు సర్వసాధారణం అయిపోయింది. ఇలా రివ్యూల కోసం డైరెక్టర్లు ఎదురుచూస్తున్నారు అంటే తాము తీసిన సినిమాపై వారికి ఎంత నమ్మకం ఉందో అర్ధం చేసుకోవచ్చు. సినిమా హిట్టయితే తేజ లాగా ‘మార్నింగ్ షోలకు వచ్చే వారు ధర్మామీటర్ లు పట్టుకుని, కొలతలు వేసుకుని వస్తారని, సాయంత్రం షోకు వచ్చేవారు నిజమైన ప్రేక్షకులు’ అని వ్యంగ్యాస్త్రాలు సందిస్తుంటారు, అదే ఫ్లాప్ అయితే హరీష్ శంకర్ ‘డీజే’ మాదిరి ఎదురుదాడి చేస్తుంటారని అర్ధమవుతోంది.
తాజాగా అదే కోవలో చేర్పోయింది నారారోహిత్ శ్రీవిష్ణు, సుదీర్ బాబుల మల్తీస్టారర్ చిత్రం ‘వీర భోగ వసంత రాయులు’ . ‘ఫక్ ఆల్ రివ్యూస్’ – ‘వీర భోగ వసంత రాయులు’ ఇదే ట్యాగ్‌లైన్‌తో ఓ పోస్టర్ విడుదల చేశాడు సదరు దర్శకుడు. రివ్యూలు సరిగా లేకపోతే, అందులో తీవ్రమైన విమర్శ ఉంటే తట్టుకోలేని నాలుకలు, మెదళ్లు ఏమైనా అంటాయి, ఎలాగైనా ఆలోచిస్తాయి. అలా బయటకు వచ్చిందే ఈ కల్ట్ అక్కసు. ఈ శుక్రవారం విడుదలైన `వీర భోగ వసంత రాయులు`కు రివ్యూలేం బాగోలేని మాట వాస్తవం. పోనీ వసూళ్లయినా ఉన్నాయా అంటే అవీ లేవు. సినిమా బాగుండి, రివ్యూలు బాగోలేకపోయినా – వసూళ్లు కుమ్మేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ‘అందుకు ఆరేక్స్ 100 సినిమానే అతిపెద్ద సాక్ష్యం. మరి వీర భోగ వసంత రాయులు.. మాటేంటి? సినిమా బాగుంటే, రివ్యూలు ఎలావున్నా జనం చూడాలి కదా? మరి అది జరగలేదేం..? అసలు రివ్యూ అంటే అదేదో అన్నట్టు క్రియేట్ చెసారు కానీ, అది చూసేది కూడా మనిషే అని గుర్తించరెందుకు ?
అన్నట్టు సదరు దర్శకుడు గురించి ఓ మాట చెప్పాలి. సుకుమార్‌ని తన సినిమా ఫంక్షన్‌ని గెస్ట్ గా పిలిచి `వన్ సినిమా మీరు సరిగా తీయలేకపోయారు నేనైతే సూపర్ హిట్ చేసేవాడ్ని. ఈ సినిమాతో నేనే మీకు పోటీ` అంటూ బిల్డప్పులు ఇచ్చాడు. అది ఓవర్ కాన్ఫిడెన్సా? లేదంటే నిజంగానే `వన్` సినిమాపై తనకు అలాంటి అభిప్రాయమే ఉందా? అనేది పక్కన పెడితే ఓ వేదికపై, మీడియా అంతా ఉండగా.. ఓ దర్శకుడ్ని పట్టుకుని `నీ సినిమా నాకు నచ్చలేదు` అంటూ స్టేట్‌మెంట్ ఇవ్వడం అంటే ఓ రకంగా ‘వన్’ సినిమా పై అది ఇంద్రసేన ఇచ్చిన రివ్యూ అనుకోవాలి. రివ్యూయర్ లు కూడా చేసే పని అదే కదా? నచ్చితే నచ్చిందని, లేకపోతే లేదని చెప్పడం వారి కర్తవ్వం. రివ్యూలన్నీ వ్యతిరేకంగానే ఉన్నాయంటే – ఈ సినిమా ఎవ్వరికీ నచ్చలేదనే కదా? ఓ దర్శకుడ్ని పిలిచి ‘నీ సినిమా బాలేదు’ అని చెప్పగలిగిన ఓ కుర్ర దర్శకుడు – తన సినిమాపై వచ్చిన నెగిటీవ్ రివ్యూల్ని ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నాడు అనేది గనుక ఆలోచిస్తే ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉంటుంది.