బాలయ్య కష్టపడ్డాడు, మంచి నిర్ణయం!

director krish will direct balakrishna ntr biopic movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బాలకృష్ణ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘ఎన్టీఆర్‌’ చిత్రంపై నీలి నీడలు కమ్ముకున్నాయని, తేజ తప్పుకోవడంతో ఆ సినిమాను బాలయ్య చేస్తాడని, లేదా మరే దర్శకుడికో అప్పగిస్తాడు అంటూ వార్తలు వచ్చాయి. దాంతో అంతా కూడా ఎన్టీఆర్‌ చిత్రంపై ఆశలు వదులుకున్నారు. ఒక వేళ బాలయ్య చేస్తే ఆ సినిమా అంతా కూడా ఏకపక్షంగా ఉండటంతో పాటు, ఆకట్టుకోదని అంతా భావించారు. ఎన్టీఆర్‌ స్థాయిని నిలిపే దర్శకుడు ఈ చిత్రాన్ని టేకోవర్‌ చేయకపోతే ఎవరు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపించరు. దాంతో బాలకృష్ణ ఈ చిత్రం కోసం దర్శకుడు క్రిష్‌ను ఒప్పించాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం వచ్చింది. బాలయ్య కెరీర్‌లో 100వ సినిమా అయిన ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలాంటి ప్రతిష్టాత్మక కథలు తెరకెక్కించాలి అంటే క్రిష్‌ లాంటి దర్శకుడు కావాలి. అందుకే క్రిష్‌ను బాలయ్య ఒప్పించాడు.

మొదట ‘ఎన్టీఆర్‌’ సినిమా ప్రస్థావన తీసుకు వచ్చినప్పుడు బాలయ్య సున్నితంగా తిరష్కరించాడు. ఏదో కారణం చెప్పి బాలయ్య నుండి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. హిందీలో చేస్తున్న మణికర్ణిక చిత్రం ఆలస్యం అవుతుందని, అందువల్ల తాను ఈ చిత్రాన్ని ఇప్పట్లో టేకోవర్‌ చేయలేను అంటూ క్రిష్‌ చెప్పడంతో బాలయ్య అందుకు తగ్గట్లుగా తన ప్లాన్‌ మార్చుకున్నాడు. ఇప్పటికిప్పుడు కాకున్నా కాస్త ఆలస్యంగా అయినా ఎన్టీఆర్‌ సినిమాకు దర్శకత్వం వహిస్తే ఓకే అంటూ క్రిష్‌ ముందు ప్రపోజల్‌ ఉంచాడు. వచ్చే సంవత్సరం వేసవి వరకు విడుదల చేయాలని భావిస్తున్నాం కనుక ఈ సంవత్సరం చివర్లో మొదలు పెట్టినా పర్వాలేదు అంటూ బాలయ్య చెప్పుకొచ్చాడు. ఏదోలా క్రిష్‌ను బాలయ్య ఒప్పించే ప్రయత్నం చేసి సఫలం అయ్యాడు. ఎట్టకేలకు బాలయ్యకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఎన్టీఆర్‌ జయంతి సందర్బంగా ఆ విషయాన్ని బాలయ్య అధికారికంగా ప్రకటించాడు. తనవంతు కృషి చేసి ఎన్టీఆర్‌ సినిమాకు న్యాయం చేస్తానంటూ క్రిష్‌ చెప్పుకొచ్చాడు.