డేరా బాబాతో వర్మకు సంబంధం ఏంటి?

director-ram-gopal-varma-sensational-comments-on-gurmeet-ram-rahim-baba

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇందు కలడు అందులేడు అనే సందేహం వలదు, ఎందెందు వెదికినా అందందు కలడు.. అవును నిజంగానే వర్మ ఏ విషయంలో అయినా తల దూర్చుతాడు, ఏ విషయాన్ని వదలకుండా తన కామెంట్స్‌ విసురుతాడు. అందుకే పై వ్యాఖ్యలు ఆయనకు బాగా సూట్‌ అవుతాయి. దేశంలోనే కాకుండా ప్రపంచంలోని బర్నింగ్‌ విషయాలన్నింటిపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ ఎప్పటికప్పుడు మీడియాలో ప్రముఖంగా కనిపించే వర్మ తాజాగా డేరా బాబాపై పడ్డట్లుగా తెలుస్తోంది. 

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేరా బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష ఖరారు అయ్యింది. గత రెండు దశాబ్దాలుగా ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రజలతో దేవుడిగా పిలిపించుకుంటున్న డేరా బాబా అలియాస్‌ గుర్మీత్‌ బాబా గుట్టు రట్టయ్యింది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక మహిళ పెట్టిన కేసుకు ఇప్పుడు గుర్మీత్‌ బాబాకు శిక్ష పడటం జరిగింది. ఉత్తరాదితో పాటు దక్షిణాదిన కూడా అభిమానులను ఏర్పర్చుకుని మెల్లగా తన సామ్రాజ్యాన్ని విస్తరించాలని భావించిన డేరా బాబా ఆశలు అడియాశలు అయ్యాయి. ఇలాంటి బర్నింగ్‌ విషయాలపై వర్మ స్పందించకుండా ఎప్పటికి ఉండడు.

అందరు అనుకున్నట్లుగానే తాను గుర్మీత్‌ బాబాపై సినిమా తీస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇంత మందిని పిచ్చివారిని చేసిన గుర్మీత్‌ బాబా నీచుల్లో గొప్పవాడు అంటూ వర్మ కామెంట్స్‌ చేశాడు. డేరా బాబా ఆశ్రమంకు వెళ్లి మరీ ఆయన గురించి పూర్తి వివరాలు తెలుసుకుని, ఆయన శిష్యులతో మాట్లాడి ఆ తర్వాత స్క్రిప్ట్‌ను రెడీ చేస్తాను అని, వీలుంటే జైలుకు వెళ్లి కూడా బాబాను డేరా బాబాను కలుస్తానని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే పలు వివాదాస్పద అంశాలపై సినిమాలు చేసి రచ్చ చేసిన ఈ దర్శకుడు గుర్మీత్‌ బాబా సినిమాలో ఏ స్థాయి రచ్చ చేస్తాడో చూడాలి.

మరిన్ని వార్తలు:

పైసా వసూల్ మూవీ తెలుగు బులెట్ రివ్యూ…

నిఖిల్‌ పెళ్లి క్యాన్సిల్‌, కారణం..!

ఆకాష్‌ కోసం చిన్న సైజు పోకిరి..