పవన్‌పై మాటల దాడి కొనసాగిస్తుంది

sri reddy counter to comments on pawan kalyan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రామ్‌ గోపాల్‌ వర్మ ప్రోద్బలంతో పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శల పాలు అయిన శ్రీరెడ్డి అలియాస్‌ శ్రీశక్తి మళ్లీ పవన్‌ను టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేసింది. పవన్‌ కళ్యాణ్‌ తల్లికి పాదాభివందనం చేసి క్షమాపణలు చెబుతున్నట్లుగా శ్రీరెడ్డి ఒక పోస్ట్‌లో పేర్కొంది. లక్ష సార్లు అంజనదేవి గారికి క్షమాపనలు చెబుతున్నాను అని, అమ్మ క్షమించండి అంటూ పవన్‌ తల్లికి క్షమాపణలు చెప్పిన శ్రీరెడ్డి మరో వైపు పవన్‌ను మాత్రం టార్గెట్‌ చేస్తూనే ఉంది. పవన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతుంది. గతంలో కత్తి మహేష్‌ అంటే అంతకు మించి పవన్‌ను విమర్శిస్తుంది. పవన్‌ చేస్తున్న ప్రతి పనిని శ్రీరెడ్డి విమర్శించడం పనిగా పెట్టుకుంది.

Pawan Amma gariki ,na sirasu vanchi sashtangam padi laksha namaskaralu..kshaminchandi Amma.. amrutha murthi meeru..Me…

Publiée par Sri Reddy sur vendredi 20 avril 2018

తన అభిమానులను కంట్రోల్‌లో పెట్టుకోలేని ఒక వ్యక్తి రాష్ట్రంను ఎలా చక్కబెడతాడు అంటూ శ్రీరెడ్డి విమర్శలు చేసింది. శ్రీరెడ్డి పవన్‌ పేరు ఎత్తకుండా ట్విట్టర్‌లో.. మీ పేరు ప్రతిష్టలను సినిమా ఇండస్ట్రీలో, మా ఛాంబర్‌లో చూపించండి. అంతే తప్ప మీడియా మీద చూపించాలని ప్రయత్నించడం పద్దతి కాదు. తాను జాన్సీ లక్ష్మీబాయిలా పోరాటం చేస్తున్నాను అని, తన జోలికి వస్తే బాగుండదంటూ హెచ్చరించింది. అభిమానులను హద్దుల్లో ఉంచుకోకుంటే వారి వల్లే నీకు నష్టం చేకూరుతుందని పేర్కొంది. ప్యాకేజీల పోరాటాలు చేసేది ఎవరో అందరికి తెలుసు అని, పదేళ్ల క్రితం తాను ఒంటరిగా ఇండస్ట్రీకి వచ్చాను అని, అప్పటి నుండి కష్టపడుతూనే ఉన్నట్లుగా శ్రీరెడ్డి చెప్పుకొచ్చాడు. వరుసగా ఆరు ఏడు ట్వీట్స్‌ను పవన్‌కు వ్యతిరేకంగా చేసిన శ్రీరెడ్డి మరోసారి హాట్‌ టాపిక్‌ అయ్యింది. శ్రీరెడ్డి ట్వీట్స్‌కు పవన్‌ ఫ్యాన్స్‌ తీవ్ర స్థాయిలో ట్రోల్‌ చేశారు. శ్రీరెడ్డిని బండ బూతులు తిడుతూ రిప్లే ఇస్తున్నారు.

Nuvvu praja nayakudaithe rashtram allarlatho rana rangam chestav, fans ni manage chesukoleni nuvvu,rashtrani ela manage…

Publiée par Sri Reddy sur vendredi 20 avril 2018