ఒట్టు తీసి గట్టున పెట్టిన వర్మ

ram gopal varma tweets on pawan kalyan.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పవన్‌ కళ్యాణ్‌పై శ్రీరెడ్డితో అనుచిత వ్యాఖ్యలు చేయించినందుకు చింతిస్తున్నట్లుగా ప్రకటించిన వర్మ, పలు సార్లు మెగా ఫ్యామిలీ హీరోలకు, మెగా ఫ్యాన్స్‌కు, పవన్‌కు క్షమాపణలు చెప్పిన విషయం తెల్సిందే. మరెప్పుడు కూడా పవన్‌ గురించి కాని, మెగా హీరోల గురించి కాని కామెంట్స్‌ చేయను అంటూ తన తల్లిపై ఒట్టు వేసి మరీ వర్మ ప్రమాణం చేశాడు. దాంతో ఇక వివాదం సర్దుమనిగినట్లే అని అంతా భావించారు. కాని షాకింగ్‌గా వర్మపై పవన్‌ చేస్తున్న తీవ్ర విమర్శలకు వర్మ తనదైన శైలిలో సమాధానం చెప్పడం జరిగింది. ఇదే సమయంలో పవన్‌పై ఇకపై వ్యాఖ్యలు చేయను అంటూ తన తల్లిపై వేసిన ఒట్టును తీసి గట్టున పెడుతున్నట్లుగా వర్మ ప్రకటించాడు.

తాజాగా ట్విట్టర్‌లో వర్మ స్పందిస్తూ.. నేను చేసిన పనికి సారీ చెప్పి ఇకపై పీకేపై కామెంట్స్‌ చేయను అంటూ నా తల్లిపై ఒట్టు వేశాను. ఆ తర్వాత నాపై పవన్‌ విమర్శలు చేయడం, సీబీఎన్‌, లోకేష్‌, శ్రీనిరాజు, ఆర్కే, రవి ప్రకాష్‌ల కూటమిలో ఉన్నాను అంటూ ఆరోపించడంతో నేను నా తల్లికి చెప్పి, ఆమె అంగీకారంతో ఇప్పుడు నా ఒట్టును తీసి వేస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశాడు. ఒట్టును తీసిన వర్మ తీవ్ర స్థాయిలో పవన్‌పై విమర్శలు గుప్పించేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. పవన్‌ను గెలకడంతో వర్మ పెద్ద తేనెతుట్టెను కదిపినట్లయ్యింది. దాంతో ఇప్పుడు ఆయన చిక్కుల్లో పడ్డాడు. ఈ వివాదం నుండి వర్మ ఎలా బయట పడతాడో చూడాలి.