Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సౌత్ సినిమాల స్థాయి ఇటీవల అమాంతం పెరిగి పోయింది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు సౌత్ సినిమాలను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ చిన్న చూపు చూసేవారు. కాని ఇప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్లో విడుదల చేసేందుకు పోటీ పడుతున్నారు. స్టార్ నిర్మాతలు సైతం సౌత్ సినిమాలను బాలీవుడ్లో విడుదల చేస్తామంటూ ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా తమిళ దర్శకుడు శంకర్, తెలుగు దర్శకుడు రాజమౌళి సినిమాలకు బాలీవుడ్లో మంచి డిమాండ్ ఉంది. బాలీవుడ్లో సౌత్ సినిమాల స్థాయిని పెంచిన మొదటి దర్శకుడు శంకర్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘2.0’. రోబోకు సీక్వెల్ అంటూ అంతా భావిస్తున్నారు. అయితే ఈ సినిమా రోబోకు సీక్వెల్ కానే కాదు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
‘రోబో’ కథకు ఈ కథకు ఒక్క పాయింట్ కూడా మ్యాచ్ కావు అని, అయితే ఆ సినిమాలో కనిపించిన విధంగానే రజినీకాంత్ రోబో మాదిరిగా కనిపిస్తాడని, అంతకు మించి మరే పోలిక లేదని దర్శకుడు శంకర్ ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘రోబో’ పాత్రను మాత్రమే తాను వాడుతున్నామని, అంతకు మించి ఆ సినిమాకు సంబంధించిన ఏ అంశాలను పరిగణలోకి తీసుకోలేదు అంటూ దర్శకుడు చెప్పుకొచ్చారు. సినిమాను దాదాపు రెండు సంవత్సరాలుగా తెరకెక్కిస్తున్నారు. ఎట్టకేలకు సినిమాను ముగింపు దశకు తీసుకు వచ్చారు.
రజినీకాంత్ హీరోగా అక్షయ్ కుమార్ విలన్గా నటిస్తున్న ఈ సినిమాలో అమీజాక్సన్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెల్సిందే. 5000 కోట్లు వసూళ్లు చేస్తుందనే నమ్మకతో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు. హాలీవుడ్లో భారీ ఎత్తున ఈ సినిమా ప్రచారం చేస్తున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ సక్సెస్ చిత్రంగా ‘2.0’ నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.