బాహుబలికి పోటీ భారతీయుడు సీక్వెల్ ?

director-shankar-doing-bharateeyudu-movie-sequel-in-dil-raju-production

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

దిల్ రాజు, శంకర్, కమలహాసన్ కాంబినేషన్ లో భారతీయదు సీక్వెల్ తీస్తున్నారు అన్న ప్రకటన సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీ కి పెద్ద షాక్. శంకర్, కమల్ కాంబో గురించి ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అందులో వున్న విశేషం కన్నా ఈ కాంబోకి,ఇంత భారీ సినిమాకి దిల్ రాజు నిర్మాత కావడమే ఎక్కువమందిని ఆశ్చర్యపరుస్తోంది. సినిమాకి పెట్టే ప్రతి రూపాయి, దర్శకుడి సృజనలో భాగస్వామ్యం, రిలీజ్ అయ్యే దాకా మార్పులు చేర్పులు…ఇలా దిల్ రాజు క్యాంపు లో ఎన్నో జరుగుతుంటాయి. అందుకే అక్కడ కొత్త దర్శకులు, ఇంకా నిలదొక్కుకోని డైరెక్టర్స్ లేదా ఆ బ్యానర్ ని నమ్ముకున్న దర్శకులు ఎక్కువగా కనిపిస్తారు.

దిల్ రాజు బ్యానర్ దర్శకుల విషయమే కాదు నిర్మాణ విలువలు తక్కువ అని చెప్పకపోయినా భారీగా మాత్రం వుండవు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి మల్టి స్టారర్ తీసినా మహేష్, వెంకటేష్ రెమ్యునరేషన్ కన్నా ప్రొడక్షన్ కాస్ట్ తక్కువగా ఉంటుందని అప్పట్లో అనుకున్నారు. కానీ దర్శకుడు శంకర్ విషయానికి వస్తే సౌత్ ఇండియా లో భారీ చిత్రాలకి ఆద్యుడు. తొలి సినిమా నుంచి ఇప్పటిదాకా ఆయన ఒక్క చిన్న బడ్జెట్ తీయలేదు. కనీసం ఆలోచించలేదు. ఇక హీరో కమల్ చిన్న, పెద్ద సినిమా అని గాకుండా కంటెంట్ మీదే ఎక్కువగా ఆధారపడతారు. ఇంత భిన్నమైన ఆలోచనలున్న ఈ వ్యక్తులు ఒక్క వేదిక మీదకి రావడానికి ,ఇలాంటి కాంబినేషన్ సెట్ కావడానికి ఏదో

పెద్ద కారణం వుండే ఉంటుంది. ఆ పెద్ద కారణం బాహుబలి సినిమా, దర్శకుడు రాజమౌళి అని తెలుస్తోంది.బాహుబలి తో తెలుగు సినిమా స్థాయి పెరిగింది అనడంలో సందేహం లేదు. ఆ ఘనతలో దర్శకుడు రాజమౌళి పాత్ర ఎక్కువ. ఆ విషయాన్ని గమనించిన దిల్ రాజు అదే స్థాయిలో ఓ భారీ చిత్రం తీయడానికి రాజమౌళిని సంప్రదించారట. అయితే జక్కన్న నుంచి కచ్చితమైన హామీ దొరకలేదట. అదే టైం లో శంకర్, కమల్ కాంబోలో భారతీయుడు సీక్వెల్ ప్రతిపాదన రాగానే దిల్ రాజు టెంప్ట్ అయిపోయారట. ఇప్పటిదాకా తాను సినిమా నిర్మాణంలో పాటించే కొన్ని విషయాల్ని కూడా పక్కనబెట్టి ఈ సినిమా తీయడానికి దిల్ రాజు ముందుకు వచ్చారు. పైకి ఏమి చెప్పినా ఈ వ్యవహారం చూస్తుంటే బాహుబలికి పోటీగానే భారతీయుడు సీక్వెల్ సెట్ అయ్యిందనుకోవాలి.