మోడీ స్కాంపై మూవీకి సన్నాహాలు

Director Shankar Planning Nirav Modi PNB Scam As Bharateeyudu2 Movie
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీరవ్‌ మోడీ కుంబకోణంపై మీడియాలో పతాక స్థాయిలో కథనాలు వస్తున్నాయి. జాతీయ స్థాయి నుండి గల్లీ స్థాయి వరకు అన్ని మీడియాల్లో కూడా నీరవ్‌ మోడీ కుంబకోణం గురించిన కథనాలు రాస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళ దర్శకుడు శంకర్‌ నీరవ్‌ మోడీకి సంబంధించిన జీవిత చరిత్రను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడట. ప్రస్తుతం కమల్‌ హాసన్‌ కోసం ‘భారతీయుడు’ చిత్రం సీక్వెల్‌ స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్న శంకర్‌ అందులో నీరవ్‌ మోడీ కుంబకోణంను ఇన్వాల్వ్‌ చేయాలనే అభిప్రాయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. 

శంకర్‌ మాత్రమే కాకుండా ఇంకా పలువురు ఫిల్మ్‌ మేకర్స్‌ కూడా నీరవ్‌ మోడీ ఎలా కింది స్థాయి నుండి ఎదిగాడు, ఆయన వ్యాపార సామ్రాజ్యంను ఎలా విస్తరించాడు, ఒకరికి తెలియకుండా ఒకరిని ఆయన ఎలా మోసగించాడు, ఏకంగా 17 వేల కోట్లకు బ్యాంకులను ఎలా మోసం చేశాడు అనే విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పలువురు ఈ మోడీ కుంబకోణం నేపథ్యంలో సినిమా తీస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో చాలా ముందు ఉండే వర్మ మాత్రం ఇప్పటి వరకు నోరు తెరవలేదు. లోలోపల వర్మ మోడీ స్కాం గురించి తెలుసుకుంటున్నాడేమో అని, త్వరలోనే నీరవ్‌ కుంబకోణం అనే చిత్రాన్ని మొదలు పెడతాడేమో అని సినీ వర్గాల వారు అంటున్నారు.