వైర‌ల్ గా మారిన రేణుదేశాయ్ క‌విత‌… పవన్ గురించేనా

Renu Desai on Dolor A Figure Of Speech
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఒక‌ప్పుడు మోడ‌ల్ గా,న‌టిగా… ప్ర‌స్తుతం ద‌ర్శ‌కురాలిగా, టీవీ షో జ‌డ్జిగా… ఇలా అనేక విభాగాల్లో త‌న ప్ర‌తిభాపాట‌వాలు చూపించినా…. రేణుదేశాయ్ ను అంద‌రూ గుర్తించేది సినీన‌టుడు, రాజ‌కీయ నేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌గానే. ప‌వ‌న్ తో విడిపోయి ఏడేళ్లు గ‌డిచినా… ఇప్ప‌టికీ ఆమె దేని గురించి మాట్లాడినా ప‌వ‌న్ తో ముడిపెడుతూనే చూస్తారు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణుదేశాయ్ తాజాగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోపై కూడా ఇదే ర‌క‌మైన కామెంట్లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. త‌న జీవితంలో పాతుకుపోయిన జ్ఞాప‌కాలు మ‌ళ్లీ గుర్తొచ్చాయంటూ కొంచెం బాధ‌, ఇంకొంచెం ఆవేద‌న క‌ల‌గ‌లిపి ఆమె రాసుకున్న ఓ క‌విత సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నాలోని జ్ఞాప‌కాల‌న్నింటినీ వెలికితీశాను. ఆయ‌న మాట‌లు, ప‌దాలు, ఆయ‌న పేరు చెక్కిన క‌లం నా జ్ఞాప‌కాల్లో నిక్షిప్త‌మ‌య్యాయి. కానీ క‌మ్ముకున్న హిమం క‌రిగిపోయి మ‌ళ్లీ ఆ జ్ఞాప‌కాలు క‌ళ్లెదుట నిలిచాయి. విధి ఎంత బ‌లీయం. మ‌న‌సు లోతుల్లో పాతుకుపోయిన జ్ఞాప‌కాలన్నింటినీ మ‌ళ్లీ గుర్తుచేసింది. ఆ జ్ఞాప‌కాల‌ను ఇప్పుడు తిరిగి చూసుకుంటే తుప్పు ప‌ట్టిన క‌లం, దానిపై రాసుకున్న పేరు తుడిచిపెట్టుకుపోయాయి. ముక్క‌లైన హృద‌యం, నేను రాసుకున్న లేఖల కాగిత‌పు ముక్క‌లు క‌న్పించాయి అంటూ రేణు దేశాయ్ వీడియో సాగింది.

ఆమె ఎవ‌రిని ఉద్దేశించి ఈ వీడియో పోస్ట్ చేశారో తెలియ‌దు కానీ… వీడియో చూసిన ప‌వ‌న్ అభిమానులు మాత్రం ప‌వ‌న్ తో త‌న‌కున్న జ్ఞాప‌కాల‌ను గుర్తుచేసుకుంటూ రేణు ఈ క‌విత రాసుకున్నార‌ని అంటున్నారు. చాలా బాగా చెప్పావు వ‌దినా అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ క‌విత విష‌యం ప‌క్క‌న పెడితే రేణుదేశాయ్ ఇత‌ర ఏ విష‌యాల‌పై స్పందించినా… అది ప‌వ‌న్ గురించే అన్న అభిప్రాయంలో ఉంటారు ఆయ‌న అభిమానులు. నిజానికి ప‌వ‌న్ మాజీ భార్య అన్న ట్యాగ్ లైన్ ఆమెకు కొన్ని చేదు అనుభ‌వాలు ఎదుర‌య్యేలా కూడా చేసింది. రెండో పెళ్లిపై ఆమె వ్య‌క్త‌ప‌రచిన అభిప్రాయాల‌ను చూసి ప‌వ‌న్ అభిమానులు కొంద‌రు ఆమెను తూల‌నాడుతూ కామెంట్లు చేయ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. తాజా క‌విత గ‌మ‌నిస్తే… తాను జ్ఞాప‌కాల్లా నిక్షిప్తం చేయాల‌నుకున్న విష‌యాలు ఇప్పుడు లేవ‌న్న అభిప్రాయాన్ని రేణుదేశాయ్ వ్య‌క్తంచేశారు. జ్ఞాప‌కాలు తిరిగి చూసుకుంటే తుప్పు ప‌ట్టిన క‌లం, దానిపై రాసున్న పేరు తుడిచిపెట్టుకుపోయాయి. ముక్క‌లైన నా హృద‌యం, నేను రాసుకున్నలేఖల కాగిత‌పు ముక్క‌లు క‌న్పించాయ‌నడం ద్వారా పాత‌సంగ‌తుల‌న్నీ త‌న మ‌న‌సు పొర‌ల‌నుంచి తొల‌గిపోయాయంటున్నారు రేణుదేశాయ్.