సుకుమార్…కొన్ని క్ష‌ణాల అశ్విన్..

director sukumar letter to nag ashwin

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మ‌హాన‌టికి ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు కొన‌సాగుతున్నాయి. సినిమా చూసిన పలువురు సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియాలో త‌మ అభిప్రాయాలు వ్య‌క్తంచేస్తున్నారు. ఓ క్లాసిక‌ల్ చిత్రాన్ని తెర‌కెక్కించార‌ని, సావిత్రి జీవితాన్ని తెర‌పై అత్య‌ద్భుతంగా ఆవిష్క‌రించార‌ని కొంద‌రు… కీర్తి సురేశ్ సావిత్రి పాత్ర‌లో జీవించేసింద‌ని, దర్శ‌కుడు నాగ్ అశ్విన్ తాను ఓ గొప్ప ద‌ర్శకుడిని అన్న విష‌యాన్ని మ‌హాన‌టితో రుజువుచేసుకున్నారని మ‌రికొంద‌రు…ఇలా ప‌లుర‌కాలుగా ప్ర‌శంసిస్తున్నారు. తాజాగా మ‌హాన‌టిని వీక్షించిన రంగ‌స్థ‌లం డైరెక్ట‌ర్ సుక‌మార్..సినిమాపై త‌న అభిప్రాయాన్ని..సినిమా చూసిన తర్వాత తాను పొందిన అనుభూతిని ఓ భావోద్వేగ‌పు పోస్ట్ లో వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. సినిమా చూసి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత‌..ఓ మ‌హిళ త‌న‌తో పంచుకున్న ఆనందానుభూతిని సుకుమార్..

వినూత్నంగా నాగ్ అశ్విన్ కు తెలియ‌జేశారు. ప్రియ‌మైన అశ్విన్… మహాన‌టి సినిమా చూసి బ‌య‌ట‌కు వ‌చ్చి, నీతో మాట్లాడ‌దామ‌ని నీ నంబ‌ర్ కు ట్రై చేస్తున్నాను…ఈ లోగా ఒక ఆవిడ వ‌చ్చి నువ్వు డైరెక్ట‌రా బాబు… అని అడిగింది. అవున‌న్నాను… అంతే… నన్ను గ‌ట్టిగా ప‌ట్టుకుని ఏడ్చేసింది. ఎంత బాగా చూపించావో బాబూ మా సావిత్ర‌మ్మ‌ని అంటూ… నా క‌ళ్ల‌ల్లో నీళ్లు….నేను నువ్వు కాద‌ని ఆవిడ‌కి చెప్ప‌లేక‌పోయాను… ఆవిడ ప్రేమంతా నేనే తీసుకున్నాను… మ‌న‌సారా..ఆవిడ న‌న్ను దీవించి వెళ్లిపోయింది. కొన్ని క్ష‌ణాలు నేను నువ్వైపోయాను ఆనందంతో…ఇంత‌క‌న్నా ఏం చెప్తాను… నా అనుభూతి ఈ సినిమా గురించి…-సుకుమార్.(కొన్ని క్ష‌ణాల అశ్విన్) గ‌మ‌నిక‌…ఆవిడ‌కి ఎప్ప‌టికీ నేను నువ్వు కాద‌ని తెలియ‌క‌పోతే బావుండు….అని సుకుమార్ త‌న ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసి మ‌హాన‌టి చూసిన త‌ర్వాత త‌న అనుభూతిని పంచుకున్నారు.