మళ్లీ ఆయన్ను నమ్ముతున్న మహేష్‌

Sukumar to direct mahesh babu 26th film

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు వరుసగా చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. సక్సెస్‌, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకు పోతున్నాడు. ‘బ్రహ్మోత్సవం’ మరియు ‘స్పైడర్‌’ చిత్రాలు ఫ్లాప్‌ అయినా కూడా మహేష్‌బాబు చేయబోతున్న సినిమాలపై సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల నడుమ ప్రస్తుతం ‘భరత్‌ అను నేను’ చిత్రం తెరకెక్కుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఆ చిత్రం తెరకెక్కుతుంది. వచ్చే సమ్మర్‌లో సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇక మహేష్‌ తర్వాత సినిమాకు వంశీపైడిపల్లి దర్శకత్వం వహించబోతున్నాడు.

director-sukumar

అశ్వినీదత్‌, దిల్‌రాజులు సంయుక్తంగా మహేష్‌బాబుతో సినిమాను నిర్మించబోతున్నారు. ఇప్పటికే వంశీ పైడిపల్లి స్క్రిప్ట్‌ పనిలో బిజీగా ఉన్నాడు. అతి త్వరలోనే సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది. మహేష్‌బాబు 25వ చిత్రం అవ్వడంతో వంశీ పైడిపల్లి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక వంశీతో సినిమా తర్వాత మహేష్‌బాబు చేయబోతున్న సినిమా కూడా అప్పుడే కన్ఫర్మ్‌ అయ్యింది. మహేష్‌బాబు 26వ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహించబోతున్నాడు.

mahesh-babu

మహేష్‌బాబు, సుకుమార్‌ల కాంబినేషన్‌లో ‘1’ చిత్రం వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా ప్రేక్షకులకు అర్థం కాలేదు, కాని సినిమాకు మాత్రం భారీ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. కాని కలెక్షన్స్‌ మాత్రం రాలేదు. అయినా కూడా మహేష్‌బాబుకు సుకుమార్‌ అంటే అభిమానం పెరిగి పోయింది. అందుకే మరోసారి సుకుమార్‌ దర్శకత్వంలో నటించాలని అప్పుడే భావించాడు. ప్రస్తుతం చరణ్‌తో ‘రంగస్థలం’ చిత్రాన్ని చేస్తోన్న సుకుమార్‌ ఆ తర్వాత మహేష్‌బాబుతో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే ఒక మంచి కథను మహేష్‌బాబుకు చెప్పి ఒప్పించినట్లుగా సమాచారం అందుతుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో మొదటి సినిమాకు కేవలం విమర్శకుల ప్రశంసలు మాత్రమే దక్కాయి, మరి ఈసారి అయినా కలెక్షన్స్‌ కూడా వస్తాయేమో చూడాలి.