‘హౌరాబ్రిడ్జ్‌’ టైటిల్‌ హైలైట్‌ అవుతుంది : దర్శకుడు యాదు

director yadhu says howrah bridge title will highlight

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రాహుల్‌ రవీంద్రన్‌, ఛాందిని చౌదరి జంటగా యాదు దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న ప్రేమ కథా చిత్రం ‘హౌరాబ్రిడ్జ్‌’. ఈ చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. తాజాగా విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ దక్కింది. టీజర్‌ విడుదల తర్వాత సినిమాపై అందరిలో కూడా ఆసక్తి మొదలైంది. టీజర్‌లోనే దర్శకుడు యాదు సినిమా ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ ఇచ్చాడు. ఒక విభిన్నమైన ప్రేమ కథను దర్శకుడు ఈ చిత్రంలో యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. ఇక ఎంతో పేరు ప్రఖ్యాతలున్న హౌరా బ్రిడ్జ్‌ పేరును ఈ సినిమాకు టైటిల్‌గా ఎందుకు పెట్టారా అని అంతా చర్చించుకుంటున్నారు.

టైటిల్‌ విషయమై దర్శకుడు యాదు మాట్లాడుతూ.. హీరోకు బ్రిడ్జ్‌కు చాలా ప్రత్యేకమైన ఆసక్తికరమైన సంబంధం ఉంటుంది. ఆ సంబంధం కారణంగానే హౌరా బ్రిడ్జ్‌ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా చెప్పుకొచ్చారు. సినిమాలో బ్రిడ్జ్‌కు ఉన్న ప్రత్యేకత నేపథ్యంలో టైటిల్‌ ఖచ్చితంగా యాప్ట్‌ అని సినిమా విడుదల తర్వాత అంతా భావిస్తారు. ప్రస్తుతం మాత్రం హౌరా బ్రిడ్జ్‌ టైటిల్‌ వల్ల సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కుతుంది. త్వరలోనే సినిమా ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా దర్శకుడు యాదు పేర్కొన్నారు. సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆధరించేలా తెరకెక్కిస్తున్నట్లుగా, ఇది ఒక మంచి ట్రెండ్‌ సెట్టర్‌ లవ్‌ స్టోరీ చిత్రంగా నిలుస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.