పాటలతో అదరగొడుతున్న’డిస్కో రాజా’

పాటలతో అదరగొడుతున్న'డిస్కో రాజా'

మాస్ మహారాజ్ ‘రవితేజ’ గారికి అభిమానుల పరంగా చూసుకుంటే తక్కువ గానే ఉంటారు. నిజం చెప్పాలంటే ఒక తరం లో రవితేజ గారికి బాగా ఆదరణ ఉండేది. అది రాను రాను తగ్గిపోతుంది. కొత్త హీరోలు కొత్త కథలు పుట్టుకొస్తుంటే రవితేజ గారు అవే పాత ధోరణి కథలని సినిమాలని చేసుకుంటూ రేసులో వెనకబడి ఉన్నారు. నిర్మాతల పరంగా తన రెమ్యూనరేషన్ పరంగా మంచిగా చూసుకుంటున్నరవితేజ గారు సినిమా కథల విషయంలో జాగ్రత్తలు తీసుకోవట్లేదు.

‘రాజా ది గ్రేట్’ సినిమా ద్వారా చాల రోజులకి మంచి విజయం దక్కించుకున్న మాస్ రాజా మరలా వెంటవెంటనే సినిమాలు చేసి హ్యాట్రిక్ ఫ్లాపుల హీరోల లిస్ట్ లోకి వెళ్లిపోయారు. చేతిలో ఒక సినిమా ఉంది అది కూడా చాలా జాగ్రత్తగా దర్శకులు చెప్పినట్లుగా చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమా దర్శకులు ‘వి.ఐ. ఆనంద్’ దర్శకత్వంలో ‘డిస్కోరాజా‘ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని మొదట ఇదే సంవత్సరం డిసెంబర్ నెల 20 వ తేదీన విడుదల చెయ్యాలి అనుకున్నారు. అంత మంచిగానే సాగిపోతుంది అనుకున్న తరుణంలో గ్రాఫిక్ వర్క్స్ కారణంగా సినిమా వాయిదా వేస్తున్నారు అని మీడియా లో వార్తలు వస్తున్నాయి.

‘ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్’ అధినేతలు అయిన ‘రామ్ తాళ్లూరి’ మరియు ‘రజని తాళ్లూరి’ నిర్మాతలుగా సాయి రిషిక సమర్పణలో రవితేజ గారి ఎనర్జీ కి ఏ మాత్రం అడ్డు చెప్పకుండా భారీ వ్యయంతోని సినిమాని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని మొదటి పాటని ‘నువ్వు నాతో ఏమన్నావో.. నేనేం విన్నానో’ అనే పాటని ఈ నెల 19 వ తేదీ సాయంత్రం విడుదల చేశారు. ఒక్కరోజులో ఈ పాటని చూసిన వారి సంఖ్య పది లక్షల మందికి చేరిపోయింది. ఇంకా వింటూనే ఉన్నారు.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సాహిత్యం అందించగా గొప్ప గాయకుడిగా పేరు పొందిన వారిలో ఒకలు ‘ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం’ గారు పాటని అద్భుతంగా పాడారు. డిస్కో రాజా సినిమాలో 80 ల నాటి కాలంలో రవితేజ గారు ఒక పాత్ర చేస్తున్నారు. అందుకు తగినట్టుగా ఈ పాటని సృష్టించడం జరిగింది. మరి ఈ సారి అయినా మన రవితేజ గారికి ‘డిస్కో రాజా’ సినిమా మరిచిపోలేని సినిమాగా హిట్టు వైపు దూసుకేలిపోతుందో? లేదా మళ్ళీ ఫ్లాపు సినిమాగా మిగిలిపోతుందా? అంటే సినిమా విడుదల అయ్యేలాగా చెప్పడం కష్టమే…. నిర్మాతలు కచ్చితమైన రిలీజ్ డేట్ చెప్పకపోతే సినిమా మీద జనాలకి ఆసక్తి తగ్గిపోవడం మాత్రం నిజం.