దిశా యాప్‌ ప్లేసులో ఇప్పుడు శక్తి యాప్‌

హోంమంత్రి వంగలపూడి అనిత
హోంమంత్రి వంగలపూడి అనిత

ఏపీ శాసనమండలి లో దిశా చట్టం, దిశా యాప్‌ పై అధికార… ప్రతిపక్ష నేతల మధ్య మాటలు యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం హాయాంలో దిశా యాప్‌ను మగవారితో కూడా బలవంతంగా ఫోన్లో ఎక్కించారని.. దిశా చట్టమంటూ… చట్టబద్ధతలేని ఓ చట్టాన్ని తెచ్చారని తీవ్రస్థాయిలో విమర్శించారు. అలాగే దిశా యాప్ స్థానంలో శక్తి యాప్ తీసుకొస్తున్నామని హోం మంత్రి అనిత సభకు తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ యాప్‌ను ప్రారంభిస్తున్నట్టు హోమ్ మంత్రి తెలిపారు.