Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అల్లు అర్జున్, అను ఎమాన్యూల్ జంటగా తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొంది, విడుదలైన ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. దానికి తోడు మహానటి ఆ వెంటనే రావడం, అంతుకు ముందే విడుదలైన భరత్ అనే నేను మరియు రంగస్థలం చిత్రాల కారణంగా బన్నీ మినిమం కలెక్షన్స్‌ను రాబట్టడంలో విఫలం అయ్యాడు. వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అంటూ ప్రచారం అయితే చేశారు కాని, అంత సీన్లేదు అంటూ ట్రేడ్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాపై వచ్చిన అంచనాల నేపథ్యంలో అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రాన్ని ఏకంగా 60 కోట్లకు అమ్మడం జరిగింది.
అన్ని ఏరియాల థియేట్రికల్ రైట్స్ ద్వారా 60 కోట్లు నిర్మాతలు తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే సినిమా మొదటి పది రోజుల్లో కనీసం 20 కోట్ల షేర్‌ను కూడా వసూళ్లు చేయలేక పోయింది. మొత్తం ఈ చిత్రం 30 కోట్ల వరకు వసూళ్లు చేస్తుందేమో అనే అంచనాలో ఉన్నారు. అయితే డిస్ట్రిబ్యూటర్లు ఏకంగా 30 కోట్లు నష్టం వస్తున్న నేపథ్యంలో నిర్మాత నాగబాబును పట్టుకుంటున్నారు. తమకు న్యాయం చేయాలని, తమ నష్టాల్లో కొంత మొత్తం అయిన భరించాల్సిందిగా వారు కోరుతున్నారు. అయితే నాగబాబు మాత్రం సినిమాలో ఎక్కువ శాతం వాట తనది కాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడట. కాని డిస్ట్రిబ్యూటర్లు మాత్రం తమకు న్యాయం చేయాల్సిందిగా మెగా బ్రదర్‌ను వేడుకుంటున్నారు. మరి నాగబాబు మరో నిర్మాత అయిన లగడపాటి శ్రీధర్‌తో మాట్లాడి వారికి ఏమైనా సెటిల్ చేస్తాడా లేదా వారు అంతే బలైపోవల్సిందేనా అనేది చూడాలి.