Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
DMK Chief Stalin Demanding Investigation Of Jaya Lalitha Death Case
ప్రెసిడెంట్ పోల్స్ కోసం ఓ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కేంద్రం కొనసాగిస్తోందా..? పనైపోగానే కరివేపాకులా తీసేస్తుందా..? పళనిపై దయ కోవింద్ గెలుపు వరకేనా..? స్టాలిన్ మాటలు వింటుంటే నిజమేననిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలు ముగియగానే తమిళనాడులో సర్కారు పడిపోతుందన్న స్టాలిన్ కామెంట్లు తంబీల్లో కలకలం రేపుతున్నాయి. స్టాలిన్ కు ఢిల్లీ వర్గాలే ఉప్పందించాయేమోనన్న అనుమానం కలుగుతోంది.
కానీ కేంద్రం అలా చేస్తుందా అనే అనుమానాలు ఎక్కువగానే ఉన్నాయి. కోవింద్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థి మీరాకుమార్ కు మద్దతిస్తున్న డీఎంకేకు మోడీ సర్కారు ఎందుకు ఫేవర్ చేస్తుందనేది అసలు వాదన. మిత్రుడు కాకపోయినా.. అణగిమణిగి ఉండేవాడ్ని వదిలేసి.. స్టాలిన్ ను సీఎం చేస్తే కొరివితో తల గోక్కోవడమేనని బీజేపీ పెద్దలకు తెలుసు.
మరి స్టాలిన్ వాదనకు బేసేంటి.. అంటే చీకట్లో రాయి అని చెప్పక తప్పదు. కొంతకాలంగా పొలిటికల్ మైలేజ్ కోసం ప్రతి విషయాన్ని ఇష్యూ చేస్తున్న స్టాలిన్.. జయ మరణించిన ఇన్నాళ్లకు అమ్మ మరణంపై విచారణ జరగాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉంది. ఆయన తండ్రి ఈ మాట ఎప్పుడో చెప్పగా.. ఈయనకు మాత్రం ఇన్నాళ్లకు జ్ఞానోదయం అయింది
మరిన్ని వార్తలు:
కమ్యూనిస్టులు మళ్లీ భంగపడ్డారా..?
జగన్ చొరవ పెంచాల్సిందే