బంపర్ ఆఫర్: శ్రియ‌తో డ్యాన్స్ చేయాలంటే ఇలా చేయండి.

క‌రోనా మహమ్మారి సమాజాన్ని అతలాకుతలం చేస్తుంది. ఇలాంటి సంక్షోభంలో నిరుపేద‌ల‌కి అండ‌గా నిలిచేందుకు సినీ సెల‌బ్రిటీలు ఇప్పటికే నడుం బిగించారు. కొంద‌రు విరాళాలు అందిస్తుండ‌గా.. మ‌రి కొంద‌రు నిత్యావ‌స‌రాలు అంద‌జేస్తున్నారు. తాజాగా శ్రియ తన వంతు సాయంగా నిరుపేదలకు అందించేందుకు ఓ సరికొత్త ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. ఆక‌లితో అల‌మ‌టిస్తున్న వారి ఆక‌లి తీర్చేందుకు ఓ స్వ‌చ్ఛంద సంస్థ‌తో క‌లిసి విరాళాలు సేక‌రిస్తుంది.

అదేమంటే.. @thekindnessproject.in లో కేవ‌లం రూ. 200 రూపాయలు చెల్లించి రిసిప్ట్‌ను మెయిల్ చేసి వివ‌రాలు న‌మోదు చేసుకోవాల్సిందిగా కోరింది. మే9వ తేదీ అంటే శ‌నివారం సాయంత్రం 8 గంట‌ల‌వ‌ర‌కు మీకు ఈ అవ‌కాశం ఉంది. ఆ తర్వాత ఆదివారం విజేత‌ల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని వెల్లడించింది. అయితే లక్కీడ్రాలో విజేత‌లుగా నిలిచిన వారు (వీడియో కాల్ )లో త‌న‌తో క‌లిసి డ్యాన్స్, యోగా చేసే అవ‌కాశం పొందవ‌చ్చని శ్రియ పేర్కొంది. అంతేకాకుండా మీరిచ్చే విరాళాలన్నీ నిరుపేద‌ల‌కు చేరుతాయ‌ని.. ఈ మంచి ప‌నిలో అంద‌రం భాగ‌స్వాములం అవుదామని శ్రియ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పిలుపునివ్వడం విశేషం.