సమంత వేసుకున్న చెప్పులు ఎంతో తెలుసా?

Samantha
Samantha

తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దంన్న‌ర అవుతున్నా ఇప్పటికి స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే ఉన్న హీరోయినే సమంత. గత కొంతకాలంగా మ‌యోసైటీస్‌తో బాధపడుతున్న సమంత చికిత్స తీసుకుంటూనే ఒప్పుకున్న ప్రాజెక్ట్ షూటింగ్‌ల‌లో పాల్గొంది స‌మంత. నిన్న మొన్నటి వరకు ఖుషి సినిమాతో పాటు బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ షూటింగ్‌లో బిజీగా ఉన్న సమంత తాజాగా షూటింగ్‌ల‌న్నీ పూర్తి చేసుకొని సినిమాలకు విరామం ఇవ్వాలని నిర్ణయించుకుంది.

సమంత డేట్ ఇచ్చిన ప్రాజెక్టులన్ని పూర్తి కావడంతో ఇక ఏ కొత్త సినిమాకు ఒప్పుకోకుండా ప్రస్తుతం తన ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది . ఈ క్ర‌మంలోనే ఆమె అమెరికాలో చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఖుషి సినిమా విజయ్ దేవరకొండ – సమంత హీరో హీరోయిన్లుగా పాన్ ఇండియా లెవెల్లో తెర‌కెక్కుస్తున్నారు .

ఈ సినిమాలోని రెండు పాటలు రిలీజై ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ సంపాదించాయి. ఇక ఈ పాటలో సమంత ఎంతో సింపుల్‌గా కనిపించింది . ఈ సాంగ్‌లో ఆమె వేసుకున్న చెప్పుల మీద చాలామంది ప్రేక్షకుల దృష్టి ఉంది. చూడడానికి అంత సింపుల్‌లుక్ లో అందంగా కనిపిస్తున్నాయి .ప్రస్తుతం ఈ చెప్పుల రేటు రూ.5899. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజ‌న్స్ షాక్ అవుతున్నారు . ఆ చెప్పులు సమంత లుక్ మరింత పెంచాయంటూ కామెంట్స్ చేస్తున్నారు