బుల్లితెరపై జబర్దస్త్‌కు ఉన్న క్రేజ్ మామూ లుగా ఉండదు. ఇందులో ఒక్కసారి కనిపిస్తే చాలని అనుకునే వారు వేలల్లోనే ఉంటారు. ఇక కమెడియన్లు, యాంకర్లు అయితే ఒక్కసారైనా జబర్దస్త్ లో చేయాలని అనుకుంటారు. బుల్లితెరపై ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన ఘనత కేవలం జబర్దస్త్‌కు మాత్రమే దక్కుతుంది. దాని నుంచే చాలా షోలు పుట్టుకొచ్చాయి.వాస్తవానికి మొదట్లో ఆ షో మీద ఎవరికీ పెద్దగా నమ్మకం ఉండేది కాదు. దాన్ని అందరూ రిజెక్ట్ చేశారు కూడా. కానీ తర్వాత అదే షో టాప్ రేటింగ్ తో దూసుకుపోవడంతో తిరుగులేని షోగా మారిపోయింది. అయితే ఇప్పుడు ఒక్కొక్కరుగా జబర్దస్త్ ను వీడిపోతున్న సంగతి తెలిసిందే. జడ్జిల దగ్గరి నుంచి మొదలు పెడితే రీసెంట్ గా యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ ను వీడింది.
కాగా ఇప్పుడు అనసూయ ప్లేస్ లో ఓ యాంకర్‌ను తీసుకురావాలని తెగ ట్రై చేసింది మల్లెమాల సంస్థ. కానీ ఆమె రిజెక్ట్ చేసింది. ఇప్పుడే కాదు.. గతంలో కూడా ఆమె రెండుసార్లు రిజెక్ట్ చేసింది. ఆమెనే యాంకర్ శ్రీముఖి. అనసూయ మొదట్లో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చినప్పుడు శ్రీముఖిని అడిగారు మల్లెమాల వారు. కానీ ఆమె ఒప్పుకోలేదు.
ఆ తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ కోసం కూడా ఆమెను అడిగారు. అప్పుడు వేరే షోస్ కారణంగా బిజీగా ఉండి వదులకుంది. ఇక రీసెంట్ గా అనసూయ వెళ్లిపోయినప్పుడు కూడా శ్రీముఖిని జబర్దస్త్ కోసం అడిగారు. ఇక ముచ్చటగా మూడోసారి కూడా ఆమె జబర్దస్త్ ఆఫర్‌ను తిరస్కరించింది. దాంతో ఇలా మూడుసార్లు జబర్దస్త్‌ను రిజెక్ట్ చేసిన యాంకర్ గా శ్రీముఖి పేరు వైరల్ గా మారింది.