ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ ను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులతో ‘పుష్ప 2’ దుమ్ములేపింది. అయితే, ఈ మూవీ తర్వాత బన్నీ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
కాగా, అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీ ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేయడానికి సిద్ధమవుతున్నాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమా లు వచ్చాయి. దీంతో ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ సెట్ అయ్యిందని.. దీనికి సంబంధించి త్వరలోనే ఒక అనౌన్స్‌మెంట్ కూడా రాబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ అనౌన్స్‌మెంట్ ఒక వీడియో రూపంలో రాబోతుందని తెలుస్తోంది.
దీంతో త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్‌లో రాబోయే నెక్స్ట్ సినిమా కి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.