స్మార్ట్‌ఫోన్‌ని ఎక్కువగా దేనికి ఉపయోగిస్తున్నారో తెలుసా..? షాకింగ్‌ విషయాలు..!

Do you know what smartphone is mostly used for..? Shocking things..!
Do you know what smartphone is mostly used for..? Shocking things..!

కొంత మంది దగ్గరయితే రెండు మూడు ఫోన్లు కూడా చూస్తుంటాం. స్మార్ట్‌ఫోన్‌ అనేది మనిషి జీవితంలో ఓ ప్రధాన భాగమైపోయింది. ఇదే సమయంలో ప్రతి పనీని కూడా ఇంట్లో నుంచే సులువుగా ఆన్‌లైన్‌లో చేసేస్తున్నారు. ముఖ్యంగా.. ట్విట్టర్‌ ,ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా వేదికలని చూడటం.. వీడియోలు, సినిమాలు చూడటం, గేమ్‌లు ఆడడం వంటి అనేక పనులు చేస్తున్నారు. అయితే.. ఇటీవల పరిశోధన నివేదికను ఒక ప్రముఖ సంస్థ విడుదల చేసింది. ఇందులో భారతీయులు తమ స్మార్ట్‌ఫోన్‌ని ఎక్కువగా దేనికి ఉపయోగిస్తున్నారు అనే అంశాన్ని పరిశోధించి ఆశ్చర్యకరమైన అంశాలను వెల్లడించింది.

ఈ నివేదిక ప్రకారం.. 86% మంది ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా యుటిలిటీ బిల్లులను చెల్లిస్తున్నారు. అంటే కరెంట్‌ బిల్లులు, డిష్‌ బిల్లులు వంటివి. ఇది చాలా మంచి పద్ధతి దీనివల్ల సమయం ఆదా అవుతుంది. అలాగే సుమారు 80.8% మంది ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారు. 61.8% మంది ప్రజలు స్మార్ట్‌ఫోన్‌ల నుంచి నిత్యావసర వస్తువులను ఆర్డర్ చేస్తున్నారు. దాదాపు 66.2% మంది ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఆన్‌లైన్ సేవలని బుక్ చేసుకుంటున్నారు. దాదాపు 73.2% మంది ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి కిరాణా వస్తువులను ఆర్డర్ చేస్తున్నారు. 58.3% మంది ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి డిజిటల్ నగదు చెల్లింపులు చేస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది.

ఇక.. మహిళల కంటే పురుషుల సంఖ్య ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగింస్తున్నారట. దాదాపు 62% మంది పురుషులు స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉండగా.. కేవలం 38% మంది స్త్రీలు మాత్రమే స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్నారని ఈ నివేదిక వెల్లడించింది. అలాగే.. పట్టణ, గ్రామీణ ప్రజల మధ్య కూడా తేడా ఉంది. పట్టణ ప్రజలలో 58% మంది స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉంటే.. గ్రామీణ ప్రజల్లో 41% మంది మాత్రమే స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్నారు. దీనిని బట్టి ఎంత వేగంగా స్మార్ట్‌ఫోన్‌ విప్లవం అభివృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు.