టాలీవుడ్ యంగ్ హీరో, స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్ లో, డైరెక్టర్ మల్లిక్ రామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ టిల్లు స్క్వేర్ థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతోంది . ఈ మూవీ ని చూసిన పలువురు సినీ ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ మూవీ ని చూసిన నాచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదిక గా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. టిల్లు స్క్వేర్ సూపర్ ఫన్ రైడ్. రెండు గంటల పాటు, టిల్లు గా నటించిన సిద్ధు బాగా రెచ్చిపోయాడు. అంతేకాక హీరో నాని, తనకి విపరీతం గా మూవీ బాగా నచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. చిత్ర యూనిట్ కు కంగ్రాట్స్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా, సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ మూవీ స్ వారు నిర్మాణం వహించారు.