ప్రతీ దేశం శత్రువుల దాడుల నుంచి తట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకు సంబంధించిన రక్షణ వలయాలు ఏర్పాటు చేసుకుంటుంది. ఇందు కోసం మిషన్ లు , యుద్ధ ట్యాంకులు కాకుండా సైన్యాన్ని కూడా చాల దేశాలు తయారు చేసుకుంటాయి. . అందువల్ల ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కు వసైన్యాన్ని ఉంచుకునేందుకు ప్రతీ దేశం ప్రణాళిక వేస్తుంది. అయితే ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక సైన్యాలు కలిగిన దేశాల వివరాలు ఒకసారి పరిశీలిస్తే..
భారత్ కు ఉత్తరాన చైనా దేశం సైన్యాన్ని సమకూర్చడంలో అందరికంటే ముందు ఉంది. ఆర్థికాభివృద్ధి, సాంకేతిక రంగంలో దూసుకుపోతున్న చైనా వద్ద ప్రస్తుతం 20 లక్షల మంది సైనికులు ఉన్నారు. ఈ దేశంలో యుద్ధ ట్యాంకులు,ఫిరంగులు 20 వేల కంటే ఎక్కువగా నిరోధక వ్యవస్థలు ఉన్నాయి. సైనికులను ఏర్పాటు చేసుకోవడంలో రెండో స్థానంలో భారత్ ఉంది. భారత్ లో 14.5 లక్షల మంది సైనికులు ఉన్నారు. 17 వేల కంటే ఎక్కువగా ఫిరంగులు ఉన్నాయి. భారత్ యుద్ధ విమానాల విషయంలోనూ ముందు వరుసలో ఉంది.
అగ్రరాజ్యం అమెరికాలో ఆర్థికాభివృద్ధి సాధించినా అక్కడ సైన్యం తక్కువగానే ఉంది. ఈ దేశంలో ప్రస్తుతం 13.9 లక్షల మంది సైనికులు ఉన్నట్లు సమాచారం. 46 వేలకు పైగా యుద్ధ వాహనాలు, 14 వేలకు పైగా యుద్ధ విమానాలు శక్తివంతంగా పనిచేస్తాయి. అమెరికా తరువాత ప్లేసులో ఉత్తరకొరియాలో 12.80 లక్షల మంది సైనికులు ున్నారు. అయితే ఇక్కడ 34 వేల కంటే పైగా ఫిరంగులు,యుద్ధ ట్యాంకులు 65 వేల వరకు ఉన్నాయి.
రష్యాలో ఇటీవల యుద్ధంలో పాల్గొన్నసైనికులు 8.3 లక్షల మంది ఉన్నారు. ఈ దేశం తన సైన్యాన్నిఉక్రెయిన్ దేశంతో పొరాడి పటిష్టవంతంగా తయారు చేసి రంగంలోకి దింపింది. రష్యా తరువాత 6.51 లక్షల మంది పాకిస్తాన్ లో ఉన్నారు. ఫిరంగిల, యుద్ధ ట్యాంక్ లు 7 వేల కంటే ఎక్కువగా నిరోధక వ్యవస్థలు ఉన్నాయి. 5.7 లక్షల మంది సైనికులు ఇరాన్ దేశం కలిగి ఉంది.5.5 లక్షల మంది సైనికులు దక్షిణ కొరియాలో ఉన్నారు. ఈ దేశంలో ఫిరంగిలు 7 వేల కంటే ఎక్కువగా కలిగి ఉంది. ఇక వియత్నాం4.7 లక్షలు, ఈజిప్టు 4.4 లక్షల సైన్యాన్ని కలిగి ఉన్నాయి.