కిమ్ జంగ్ ఉన్.. ఇతని పేరు వింటే అమెరికాకు కూడా చమటలు. ఉత్తర కొరియాను ప్రపంచం నుంచి వేరు చేసిన ఈ అధినేత ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. కేవలం కిమ్ మాత్రమే కాదు… అతడి కుటుంబం మొత్తం అంతే. వారికి ఎవరైనా ఎదురు తిరిగితే సొంతోళ్లని కూడా చూడడు. చంపేస్తాడంతే.. అలాంటి ఆ ప్రభుత్వంలోని అధికారులు, ఆ దేశంలో నివసించే ప్రజల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
అంతేకాదు.. ఆ దేశం ఇప్పటికీ సుమారు 100 ఏళ్లు వెనకబడే ఉంది అంటే ఆశ్చర్యపోక తప్పని పరిస్థతి. ఇంటర్నెట్ ఉండదు. కేవలం మూడే టీవీ చానెళ్లు వస్తాయి. ఫోన్లు ఉపయోగించకూడదు. అక్కడి పేదలను ఫొటోలు తీయకూడదు. ఇలా ఒకటేమిటీ ఇంకా చాలా నిబంధనలు ఉన్నాయి.
అయితే ప్రపంచమంతా కరోనా వైరస్‌తో అల్లాడిపోతుంటే.. ఆ దేశంలో మాత్రం ఒక్క కరోనా కేసు కూడా లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరమే. అయితే.. ఇన్నాళ్లు ఆ దేశాన్ని పీడించిన కిమ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడనే వార్త ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. అందుకు చాలామంది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.
ఎందుకు అలా అనుకుంటున్నారు అంటే అతడు చేసిన ఘోరాలు అలాంటివి మరి. చూద్దాం ఓసారి.
ఉత్తర కొరియాలోకి అడుగుపెట్టగానే.. తప్పకుండా కొత్త గ్రహానికి వెళ్లాం అనిపిస్తుంది. అక్కడి ప్రజలను చూస్తే.. తప్పకుండా జాలేస్తుంది. అక్కడి నిబంధనలు తెలుసుకుంటే.. అసలు మానవ హక్కులు ఉన్నాయా అనే సందేహం కలుగుతుంది. నిరంకుశత్వానికి మారుపేరైన ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ను అక్కడి ప్రజలకు దేవుడు అనుకుంటారు. కానీ లోలోపల ఏమనుకుంటారో కూడా చూద్దాం. ముఖ్యంగా ఆ దేశంలో వారానికి ఏడు రోజులు పనే. బయటకు మాత్రం వారంలో ఆరు రోజులు మాత్రమే పని అని చెప్తారు. కానీ.. సెలవు రోజు మాత్రం ఖాళీగా ఉండనివ్వరు. ఆ రోజు కూడా ప్రజలు వాలంటీర్‌గా పనిచేయాలి. అంటే.. అక్కడ ఏడు రోజులూ పని చేయాల్సిందే. కిమ్ తనని తాను దైవంగా భావిస్తాడు. ఈ సందర్భంగా ప్రజల కోసం కొన్నాళ్ల కిందట తన బయోగ్రఫీని రిలీజ్ చేశాడు. అందులో.. తాను రెండు ఇంధ్ర దనస్సుల మధ్య నుంచి పుట్టానని.. ఆ సమయంలో ఆకాశంలో కొత్తగా ఓ నక్షత్రం పుట్టిందని తెలిపాడు. అంతేకాకుండా… అతడికి వాతావరణాన్ని కంట్రోల్ చేసే పవర్ కూడా ఉదని… దైవం పుట్టించిన కారణ జన్ముడనని కిమ్ భావిస్తుంటాడు.
అయితే ఉత్తర కొరియాలో ఈ ఏడాది 2020 కాదు. అక్కడ ప్రస్తుతం 107వ సంవత్సరు నడుస్తోంది. అదేంటి… అంటే.. ముందే చెప్పాం కదా.. అదో ప్రపంచం. వేరుపడ్డ దేశం. అక్కడ అన్నీ ఇలాగే ఉంటాయి. ఆ దేశంలో మన క్యాలెండర్‌ను అస్సలు అనుసరించదు. ‘కిమ్-2 సంగ్’ పుట్టిన రోజు నుంచే అక్కడి క్యాలెండర్‌ను లెక్కిస్తారు. ఆ రోజే వారికి న్యూ ఇయర్ కూడా. ఈ దేశానికి ప్రత్యేకమైన టైం జోన్ కూడా ఉంది. జపానీయుల కంటే 30 నిమిషాలు ముందుకు సమయాన్ని మార్చుకున్నారు.
అలాగే.. దక్షిణ కొరియా అశ్లీల చిత్రాలకు పెట్టింది పేరు. కానీ.. ఉత్తర కొరియాలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. ఆ దేశంలో ఎవరైనా పోర్న్ చూస్తున్నారనే అనుమానం కలిగినా చాలు చంపేస్తారు.
అంతేకాకుండా ఎవరూ బైబిల్ చదవ కూడదు. ఎవరి వద్దనైనా అది కనిపిస్తే కూడా చంపేస్తారు. ఆ దేశంలోని ప్రతి ఇంట్లో రేడియో ఉంటుంది. అదెప్పుడూ ఆన్‌లోనే ఉండాలి. ఆపితే.. శిక్ష.
అయితే ఉత్తర కొరియా ప్రజలు అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఈ విషయం ప్రపంచానికి తెలియకుండా కిమ్ చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాడు. పర్యాటకులు అక్కడి పేదలకు ఫొటోలు తీయకూడదు. అందుకే ఆ దేశానికి వెళ్లే పర్యటకులు తమ మొబైల్ ఫోన్లను విమానాశ్రయంలోనే ఉంచి వెళ్లాలి. ఫోన్లతో ఆ దేశంలో తిరగకూడదు. పర్యాటకులు స్థానికులతో మాట్లాడకూడదు. ఇందుకు ప్రత్యేకంగా ఒక గైడును ఏర్పాటు చేసుకోవాలి. ఇష్టానుసారం ఎక్కడపడితే అక్కడ తిరగడానికి వీలులేదు.
ఉత్తర కొరియాలో జులై 8, డిసెంబరు 17 తేదీల్లో ఎలాంటి వేడుకలు నిర్వహించకూడదు. కనీసం పుట్టిన రోజు కూడా చేసుకోకూడదు. ఎందుకంటే.. కిమ్ తాత కిమ్ 2 సంగ్, కిమ్ తండ్రి కిమ్ జంగ్ 2లు ఆ తేదీల్లోనే చనిపోయారు. ఉత్తర కొరియా పిల్లలకు ప్రపంచ చరిత్రతో పనిలేదు. వారికి కేవలం కిమ్ పూర్వికులు కిమ్ జంగ్ 1, కిమ్ జంగ్ 2ల చరిత్రను బోధిస్తారు.
అలాగే… మన దేశంలో కనీసం దూరదర్శన్‌కు ఉన్నన్ని చానెళ్లు కూడా ఆ దేశంలో ఉండవు. అక్కడ కేవలం మూడు టీవీ చానెళ్లకు మాత్రమే అనుమతి ఉంది. వాటిలో కూడా కేవలం స్థానిక వార్తలు మాత్రమే ప్రసారమౌతాయి. ప్రపంచంలో ఏం జరుగుతుందో వారికి తెలీదు. అక్కడ ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. కేవలం వీఐపీలకు మాత్రమే ఇంటర్నెట్ ఇస్తారు. ఇందుకు రెడ్ స్టార్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తర కొరియా ప్రజలు నేరాలు చేయాలంటేనే భయపడిపోతారు. ఒక వ్యక్తి నేరానికి పాల్పడితే.. అతడి తర్వాతి రెండు తరాలు కూడా జైలు శిక్ష అనుభవించాలి. అంటే.. మూడు తరాలు తమ జీవితమంతా జైల్లోనే గడపాలన్నమాట.
ఇంకా ఆ దేశంలో కిమ్ ఆగడాలను వ్యతిరేకించి అనేక మంది జైల్లో ఉన్నారు. సుమారు 2.5 లక్షల మంది బంధీలుగా కేవలం కిమ్ కారణంగా ఉన్నారంటే ఆశ్చర్యమేస్తుంది. వారు తప్పించుకోకుండా జైలు చుట్టూ కరెంటు కంచెను ఏర్పాటు చేశారు. శత్రు దేశమైన దక్షిణ కొరియన్లను ఎర వేయడానికి ఉత్తర కొరియా కిజాంగ్ డోంగ్ అనే నకిలీ నగరాన్ని నిర్మించింది. అక్కడ ఎవరూ నివసించరు. రాత్రివేళల్లో మాత్రం ఇళ్లలో లైట్లు వేస్తూ జనాలు ఉన్నట్లు భ్రమ కల్పిస్తారు. అయితే.. దక్షిణ కొరియా తెలివి తక్కువది కాదు. ఈ విషయాన్ని ఎప్పుడో గుర్తించి అప్రమత్తంగా ఉంటోంది. కిమ్ మరణం తర్వాత దురాక్రమణకు రెడీ కాబోతున్నట్లు కూడా సమాచారం అందుతుంది.
అంతేకాకుండా కిమ్ జాన్ ఉన్ 2000 మంది మహిళలతో ప్రత్యేకంగా ‘ప్లెజర్ స్క్వాడ్’ను ఏర్పాటు చేశాడు. వాళ్లు కిమ్‌తో పాటు అతని సైనికులకు సర్వ కార్యాలు చేయాలి. వీరిలో 13 ఏళ్ల బాలికలే ఎక్కువగా ఉంటారు. ఇంకా కిమ్ వద్ద పనిచేసే మహిళలు వేరేగా ఉంటారు. కిమ్ ఎప్పుడు కోరితే అప్పుడు కోరికలు తీర్చాలి. మిగతా బాలికలు కూడా కిమ్‌కు సేవలు అందించే సైన్యం సెక్స్ కోరికలు తీర్చాలి. ఉత్తర కొరియాలో కూడా ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఇందులో కేవలం ఒకే ఒక అభ్యర్థి పోటీకి నిలబడతాడు. అదీ ఆయనే. ప్రజలకు అతడు నచ్చనట్లయితే.. తమకు నచ్చిన అభ్యర్థి పేరును బహిరంగంగా ప్రకటించాలి. ఆ తర్వాత వాళ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. ఆ ధైర్యం చేయలేక ప్రజలు కిమ్‌నే తమ అధినేతగా అంగీకరిస్తున్నారు.
ముఖ్యంగా కిమ్ జాన్ ఉన్ తన మావయ్యను దుస్తులు విప్పి, ఆకలితో ఉన్న 120 వీధి కుక్కల బోనులో వేసి చంపేశాడు.
ఉత్తర కొరియాలో జీన్స్ వేసుకోకూడదు. ఇక్కడి ఇళ్లు బూడిద రంగులోనే ఉండాలి. ఇళ్ల బయట తప్పకుండా కిమ్ పూర్వికులు, నాయకుల ఫొటోలు ఉండాలి.
కాగా అక్కడ మగవాళ్లంతా కిమ్ జాంగ్ ఉన్ హెయిర్ స్టైల్‌నే అనుకరించాలి. ఓరకంగా చెప్పాలంటే అక్కడి ప్రజలంతా మనసులో ఈ కిమ్ ఎప్పుడెప్పుడు చనిపోతాడా అని వేచి చూస్తున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.