మెగాస్టార్ చిరంజీవి తన డాన్స్ తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తన కెరీర్‌లో చిరంజీవి 24 వేల డాన్స్ మూవ్స్ చేశారు. అందుకే ఆయనకి గిన్నిస్ వరల్డ్ రికార్డు పురస్కారం దక్కింది. అయితే , ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి రాజమౌళి అభినందనలు తెలియజేశారు. మెగాస్టార్ తన కెరీర్‌లో 24 వేల డాన్స్ మూవ్స్ చేయడం విశేషం అని, అలాగే 46 ఏళ్ల చిరు అసాధారణ ప్రయాణం చాలా అద్భుతమని రాజమౌళి కొనియాడారు.
భారత చిత్ర సీమలో అత్యంత ప్రతిభ కనబరిచిన నటుడిగా గిన్నిస్ రికార్డు ని సాధించినందుకు మెగాస్టార్‌కి రాజమౌళి కంగ్రాట్స్ చెప్పారు. తన డాన్సులకి గాను మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న విధానంగానే… మరికొంత మంది టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ ఘనత ని సాధించడం విశేషం. అత్యధిక మూవీ ల నిర్మాతగా రామానాయుడు, అత్యధిక మూవీ ల దర్శకుడిగా దాసరి, అత్యధిక మూవీ ల దర్శకురాలిగా విజయనిర్మల, బతికున్న వారిలో అత్యధిక మూవీ ల్లో నటించిన వ్యక్తిగా బ్రహ్మానందం, అత్యధిక పాటలు పాడినవారిగా SPB, సుశీల గిన్నిస్ రికార్డ్స్‌లో చరిత్రకెక్కడం నిజంగా ఒక పెద్ద విశేషమే.