గత ఆగస్ట్‌లో కెంగేరి వద్ద యువ వైద్యుడు సార్థిక్ రైలు కింద పడి ఆత్మహత్య కేసులో హనీట్రాప్ కుట్ర బయటపడింది. దీనిపై రైల్వే పోలీసులు ముఖ్య నిందితున్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఎంబీబీఎస్ చదివిన సార్థిక్తో ఒక యువతి వాట్సప్ ద్వారా పరిచయం పెంచుకుంది.
ఒక రోజు ఆమె నగ్నచిత్రాలను పంపి వీడియోకాల్ ద్వారా మాట్లాడింది. ఆ కాల్స్‌ను రికార్డు చేసి సార్థిక్ను బెదిరించి రూ.67 వేల వరకూ వసూలు చేసింది. మరింత డబ్బు ఇవ్వాలని, లేదంటే ఇంటర్నెట్లో ఈ చిత్రాలను పెడతానని ఆమె బెదిరిస్తుండడంతో దిక్కుతోచక ఆత్మహత్య చేసుకున్నాడు.