Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
” లక్ష్మీస్ ఎన్టీఆర్” లో ఎన్టీఆర్ పాత్ర కోసం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. పాత్ర, కథ గురించి తెలిసి కూడా ప్రకాష్ రాజ్ పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఆ విషయం బయటపడకుండా ఉండేందుకు వర్మ క్యాంపు ఇంకో ప్రచారం బయటికి తెచ్చింది. అదేమిటంటే విలక్షణ నటుడు మోహన్ బాబు ని ఎన్టీఆర్ పాత్రలో వర్మ వూహించుకుంటున్నాడట. ఆయన అయితే ఎన్టీఆర్ పాత్ర రక్తి కట్టించగలడని భావిస్తున్న వర్మ అందుకు సంబంధించి ఫీలర్ వదిలినట్టు తెలుస్తోంది. అయితే వాస్తవాలు వర్మ ఆలోచనలకి చాలా దూరంగా వున్నాయి.
నిజానికి పాత్ర,కథ నచ్చితే ఎంతటి రిస్క్ అయినా చేయడానికి వెనుకాడని మనిషి ప్రకాష్ రాజ్. ఆయనే ఈ సినిమా వెనుక వున్న రిస్క్, ఉద్దేశం, ఎన్టీఆర్ ఫాన్స్ మనోభావాలు ఇవన్నీ గమనించే దూరంగా ఉండి ఉండొచ్చు. ఇక మోహన్ బాబు విషయానికి వస్తే ఆయన ఎన్టీఆర్ చాన్నాళ్లు సన్నిహితంగా వున్నారు. ఆయన తీసిన మేజర్ చంద్రకాంత్ శతదినోత్సవ సభలోనే ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిని పెళ్లాడబోతున్న విషయం ప్రకటించారు. ఇక వైస్రాయ్ ఎపిసోడ్ కి వచ్చేసరికి చంద్రబాబు కి మోహన్ బాబు మద్దతుగా నిలిచారు. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించిన లక్ష్మీపార్వతి , మోహన్ బాబు మీద తీవ్ర విమర్శలు గుప్పించారు.
కొన్నేళ్లుగా రాజకీయాల్లోకి రావాలని ఉన్నప్పటికీ ఇటు చుట్టరికం వున్న వైసీపీ , అటు మొదటినుంచి అలవాటైన టీడీపీ మధ్య మోహన్ బాబు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఈ కాలంలో ఆయన చేసిన కొన్ని ప్రకటనల్ని ఒక్కో సారి వైసీపీ ఓన్ చేసుకుంటే, ఇంకో సారి టీడీపీ ఓన్ చేసుకుంది. ఏ ఒక్క వైపు మొగ్గినా మిగిలిన వాళ్ళు దూరం అవుతారన్న ఆలోచన, వివాదాలకు దూరంగా వుండాలని పిల్లలు చెబుతున్న మాటల నేపథ్యంలో ఇప్పటికీ రాజకీయాలకు దూరంగా వుంటున్నారు మోహన్ బాబు.ఇక వర్మ ని కాదని ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్న బాలయ్య కి మోహన్ బాబు చాలా సన్నిహితుడు. ఇటీవల పైసా వసూల్ ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా వచ్చిన మోహన్ బాబు , బాలయ్య ఎలా వున్నారో అందరూ చూసారు. తాను హీరో కాకపోయినా బాలయ్య బయట సినిమా ఒప్పుకుంది ఊ కొడతారా ఉలిక్కి పడతారా తో మోహన్ బాబు కుటుంబం కోసమే. అలాంటిది ఇప్పుడు జరుగుతున్న తంతు చూసి కూడా మోహన్ బాబు ఎన్టీఆర్ పాత్రకి ఒప్పుకుంటాడని అనుకుంటే వర్మ కి నిరాశ తప్పదు.