సీనియర్ సినీ నటుడు కమెడియన్ సుధాకర్ ఆరోగ్యం బాలేక చనిపోయారు అని ఈ మధ్య కాలం లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున న్యూస్ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ రూమర్లపై సుధాకర్ రియాక్ట్ అయ్యారు. తాను చనిపోయా అని వస్తున్న వార్తలపై అయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకి ఆరోగ్యం సమస్యలు ఎం లేవని , సంతోషంగా ఉన్నానని తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను దయచేసి నమ్మకండని అయన విన్నవించారు. ఇవన్నీ తప్పుడు వార్తలేనని స్పష్టం చేశారు అయన .
గతం లో కూడా ఇలా ఈయన పై ఇలాంటి వార్తలు రావడం జరియింది. ఆయన తీవ్ర అస్వస్థకు లోనై 2010లో ఆయన కోమాలోకి కూడా వెళ్లారు. ఆ టైం లో ఆయన చనిపోయాదంటూ తప్పుడు ప్రచారం జరిగింది. చికిత్స తర్వాత ఆయన నార్మల్ అయ్యారు. ఇప్పుడు మరోసారి ఆయనపై ఇలాంటి వార్తలు రావడం తో ఈ సరి అయన స్పందించారు