జైలు పాలయ్యే ప్రమాదం

జైలు పాలయ్యే ప్రమాదం

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ ను కోట్లాది మంది నిత్యం వినియోగిస్తుంటారు. తమ సన్నిహితులతో కనెక్ట్ అయి ఉండేందుకు చాటింగ్ చేసుకుంటుంటారు. అయితే కొందరు మాత్రం వాట్సాప్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. తప్పుడు పనుల కోసం వాడుతుంటారు. అయితే ఇలాంటి పనులు చేస్తే జైలు పాలయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఉద్దేశపూర్వకంగా కాకపోయినా పొరపాటున తప్పులు చేసినా ప్రమాదమే. పొరపాటున కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ వాట్సాప్‌లో కొన్ని పనులు చేయకూడదు. అలా చేస్తే జైలుకు వెళ్లాల్లిన ప్రమాదం ఉంటుంది. అలా వాట్సాప్‌లో చేయకూడని పొరపాట్లు ఏవో చూడండి.

గ్రూప్ లోని సభ్యులెవరైనా అసాంఘిక, అక్రమ కార్యాలపాలాపని ప్రమోట్ చేస్తున్నట్టు తేలితే WhatsApp Group Adminను పోలీసులు ట్రాక్ చేసి, అరెస్ట్ చేసే ప్రమాదం ఉంటుంది. అందుకే వాట్సాప్‌ గ్రూప్స్ లో ఎట్టిపరిస్థితుల్లో అసాంఘిక కార్యకలాపాలను ప్రచారం చేయకూడదు.చైల్డ్ పోర్న్, అసభ్యకరమైన ఇమేజెస్, పోర్నోగ్రఫిక్ లాంటి అశ్లీల కంటెంట్ ను వాట్సాప్‌లో ఎట్టిపరిస్థితుల్లో షేర్ చేయకూడదు. పొరపాటుగా ఈ పనులు చేసినా.. అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.

వాట్సాప్‌ ద్వారా వేధిస్తున్నారంటూ మహిళలు మీపై ఫిర్యాదు చేసినా అరెస్ట్ అయ్యే సందర్భం రావొచ్చు.మార్ఫ్ చేసిన అభ్యంతరకరమైన ఫొటోలు, ట్యాంపర్ చేసిన వీడియోలను ఎట్టిపరిస్థితుల్లో వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్ చేయకూడదు. ఇది కూడా అరెస్టుకు దారి తీసే అవకాశం ఉంటుంది.మతాలను, ప్రార్థనా స్థలాలను కించపరిచేలా, హింసను ప్రేరేపించేలా విద్వేషపూరితమైన మేసెజ్ లను వాట్సాప్‌ ద్వారా షేర్ చేస్తే చట్టరీత్యా నేరం.

అందుకే ఇలాంటి పని చేస్తే అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది.హిడెన్ కెమెరా ద్వారా తీసిన అశ్లీల వీడియోల క్లిప్స్ షేర్ చేయడం నేరం. అందుకే ఇలాంటి క్లిప్స్ షేర్ చేస్తే జైలుకు వెళ్లే ప్రమాదం ఉంటుంది.మాదక ద్రవ్యాలు , నిషేధించిన వస్తువులు అమ్మేందుకు వాట్సాప్‌ ద్వారా బేరసారాలు చేసినా నేరమే. ఇలాంటివి పోలీసులు ట్రాక్ చేసి.. అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.ఇతరుల పేరు వాట్సాప్‌ అకౌంట్ క్రియేట్ చేసి, వినియోగిస్తున్నా నేరమే.