బిగ్​బాస్-7 తెలుగులో ఈ వారం ఎలిమినేషన్లో డబుల్ ట్విస్ట్

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 7 పదకొండో వారంలోకి అడుగుపెట్టేసింది .
Cinema New, Entertainment

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 7 పదకొండో వారంలోకి అడుగుపెట్టేసింది . ఈ వీకెండ్ ఎపిసోడ్​లో నాగార్జున కంటెస్టెంట్లపై స్ట్రాంగ్​గానే విరుచుకుపడ్డాడు. శనివారం ఎపిసోడ్​లో కంటెస్టెంట్ల తప్పొప్పుల గురించి మాట్లాడిన నాగ్.. ఆదివారం మాత్రం ఫన్​ తెప్పించాడు. ఫన్నీ గేమ్స్​తో కంటెస్టెంట్లలో జోష్ నింపాడు. అయితే ఈ వారం ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారోనని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూడగా చివర్లో సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున.

ప్రతి వారం తక్కువ ఓట్లు వచ్చిన ఒక ఇంటి సభ్యుడు హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం మాత్రం ఊహించని సంఘటన చోటుచేసుకుంది. నామినేషన్స్‌లో ఉన్న వాళ్ళు గౌతమ్‌, శోభ, అశ్విని, అర్జున్‌, ప్రియాంక, అమర్‌దీప్‌, యావర్‌, రతిక అందరూ సేఫ్‌ అయినట్లు నాగార్జున ప్రకటించాడు. చివరి వరకూ గౌతమ్‌, అశ్విన్‌లు నామినేషన్స్‌లో ఉండగా, ప్రేక్షకుల అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఎవరు ఎలిమినేట్ అవుతారోనని ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురు చూడగా.. ఇద్దరూ సేఫ్‌ అయినట్లు నాగార్జున ప్రకటించాడు.

యావర్‌ ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ తిరిగి ఇచ్చేయడంతో బిగ్‌బాస్‌ ఈ వారం ఎలిమినేషన్‌ లేకుండా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. గతవారం ఇచ్చిన ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ టాస్క్‌ మళ్లీ వస్తుందని, హౌస్‌మేట్స్‌ అందరూ పోటీపడొచ్చని చెప్పారు . వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్‌ ఉంటుందని హెచ్చరించాడు.