Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగువాడి సత్తా ఖండాంతరాల వరకు చాటాడు దర్శకుడు రాజమౌళి. బాహుబలి సిరీస్ తీసి కేవలం భారత్ లోనే కాకా చైనా జాపాన్ వంటి భాషల్లోకి కూడా అనువదించి అక్కడ కూడా వసూళ్ళ వర్షం కురిపించాడు ఆయన. ఇప్పుడు మరో సారి మన తెలుగోడి సత్తా చైనావాళ్ళకు తెలియనుంది. అవును శ్రీ కిషోర్ అనే యువ దర్శకుడు అంటే మీకు అర్ధం కాకపోవచ్చు కానీ గత ఏడాది డిఫరెంట్ సబ్జెక్ట్ తో మన ముందుకు వచ్చిన దేవి శ్రీ ప్రసాద్ అనే సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. శవాలతో శృంగారం కాన్సెప్ట్ మీద ఆ సినిమా తెరకెక్కింది. ఆ దర్శకుడే శ్రీ కిషోర్. దేవి శ్రీ ప్రసాద్ కొత్త సబ్జెక్ట్ కావడంతో తెలుగు ప్రేక్షకులు అంతగా ఆదరించకపోయినా ఇప్పుడు మరో కొత్త తరహా ప్రయత్నం చేస్తున్నాడు. ఈసారి చైనీస్ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. అదేంటి తెలుగులో సక్సెస్ అవ్వకుండానే ఎక్కడో చైనా సినిమా తీయడం ఏంటి అనుకోవచ్చు హాంగ్ కాంగ్ లో శ్రీ కిషోర్ 10 ఏళ్లుగా డాన్స్ టీచర్ గా వర్క్ చేస్తున్న శ్రీ కిషోర్ అక్కడే చైనాకి చెందినామెను ప్రేమ వివాహం చేసుకున్నాడు అందుకే అక్కడ సినీ వాతావరణం మీద ఆయనకు అవగాహన ఉంది.
తెలుగు కుర్రాడి ప్రేమలో చైనా పిల్లను పడేసే కాన్సెప్ట్ ను నెక్స్ట్ సినిమా కోసం ఎంచుకున్నాడు. ఇండియన్ బాయ్ ఫ్రెండ్ అనే టైటిల్ ను కూడా సెట్ చెసుకున్నాడు. అక్కడే స్థిరపడిన ఒక తెలుగు యువకుడు చైనీస్ గర్ల్ ప్రేమలో ఎలా పడ్డాడు అనే అంశం అందరికి నచ్చుతుందని ఆయన అంటున్నాడు. మన ఇండియన్ సినిమాలైన పీకే, 3 ఇడియట్స్, బాహుబలి వంటి సినిమాలను చైనీయులు బాగా ఆదరించారు. అక్కడ ఆ సినిమాలు పెద్ద హిట్లుగా నిలిచాయి. హాంకాంగ్‌లో పదేళ్ళ నుంచి వున్న తన అనుభవంతో చైనా భాషలోనే ఓ సినిమా తియ్యాలని భావిస్తున్నాడు శ్రీకిషోర్. ఇతను గతంలో తెలుగులో తీసిన సశేషం, దేవిశ్రీ ప్రసాద్ చిత్రాలు మంచి ప్రేక్షకాదరణను పొందాయి. ఇక శ్రవణ్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా మిగతా టెక్నీషియన్స్ మొత్తం చైనీస్ కు సంబంధించిన వారే.. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్తున్నట్టు పేర్కొన్నారు.