చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘వినయ విధేయ రామ’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో చెర్రీ సరసన కియారా అద్వాని హీరోయిన్‌గా నటించింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ఆ అంచనాలను అందుకోలేకపోయింది. నిర్మాతకు తీవ్ర నిరాశను మిగిల్చింది. అయితే పండుగ సెలవుల కారణంగా 60 కోట్ల షేర్ మార్క్ ను అందుకోగలిగింది. చెర్రీ గత చిత్రం ‘రంగస్థలం’ ఓవర్సీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టడంతో మంచి మార్కెట్ క్రియేట్ అయింది.
దీంతో ‘వినయ విధేయ రామ’ కూడా ఓవర్సీస్‌లో భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. దాంతో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ నష్టపోయాడట. ఆ నష్టాన్ని కొంతవరకైనా తగ్గించాలనే ఉద్దేశంతో, నిర్మాత డీవీవీ దానయ్య 50 లక్షల వరకూ వెనక్కిచ్చేశాడని తెలుస్తోంది. మిగతా డిస్ట్రిబ్యూటర్లకు కూడా నష్టపరిహారం చెల్లించాలనే ఉద్దేశంతో వాళ్లతో చర్చలు జరుపుతున్నట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఇది ఊరట కలిగించే విషయమే.