అమెరికాలోని అలాస్కాలో బుధవారం భారీ భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.2గా నమోదైంది. ఈ నేపథ్యంలో నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్(ఎన్టీడబ్ల్యూసీ) దక్షిణ పెనిసులా, పసిఫిక్ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను జారీ చేసింది.
హవాయ్ రాష్ట్రంలో సునామీ వాచ్ హెచ్చరికలు ఇచ్చింది. గురువారం మధ్యాహ్నం 1.27 గంటల ప్రాంతంలో హవాయ్ గవర్నర్ డేవిడ్ ఐగే ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ ఫైనల్ అప్డేట్ : అలాస్కాలో భూకంపం కారణంగా హవాయ్కి సునామీ వాచ్ హెచ్చరిక రద్దు చేయడమైంది’’ అని పేర్కొన్నారు.