దేశం ఓ పక్క కరోనాతో తల్లిడిల్లిపోతుంది. మరో పక్క పలు ప్రాంతాల్లో భూకంపం సంభవిస్తుంది. దీంతో ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన కు లోనౌతున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో గత రాత్రి 4.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. చంబా జిల్లాలో మూడు రోజుల్లో భూకంపం రావడం ఇది ఆరవసారి. గత శక్రవారం చంబా జిల్లాలో రెక్టార్ స్కేల్ పై 3, 4.3 మాగ్నిట్యూడ్ మధ్య ఐదు మార్లు భూకంపం సంభవించింది.
అయితే తాజాగా ఆదివారం రాత్రి 11.47 గంటలకు భూకంపం నమోదైందని సిమ్లా వాతావరణ కేంద్రం డైరెక్టర్ మన్మోహన్ సింగ్ తెలిపారు. చంబాకు ఈశాన్యంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని.. ప్రక్కనే ఉన్న ప్రాంతాల్లో తేలికపాటి ప్రకంపనలు కూడా సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా భూకంపం సంభవించిన ఐదుమార్లు కూడా సాయంత్రం 5.11 నుండి 8.43 గంటల మధ్య నమోదయినట్లు తెలుస్తోంది. కాగా చంబాతో సహా హిమాచల్ ప్రదేశ్ లోని చాలా ప్రాంతాలు అధిక భూకంప ప్రభావిత ప్రాంతాలుగా నమోదయ్యాయి. అయితే హిమాచల్ ప్రదేశ్ లో… కరోనా వైరస్ కోసులు ఇప్పటివరకు మూడు నమోదైనట్లు అధికారులు వివరించారు.