పెళ్లాడతానని… ప్రియుడి మోసం.. ప్రియురాలి షాక్

సమాజంలో నిత్యం వింతలు… విశేషాలు వేలల్లో చూస్తుంటాం. ప్రేయసీప్రియుల మధ్య చెలరేగే గొడవలు అయితే ఇక చెప్పలేం. తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కి చెందిన యువతి(26) అహ్మదాబాద్‌లోని వస్త్రపూర్ ప్రాంతంలో తన స్నేహితురాలి ఇంట్లో ఉంటోంది. గతంలో ఆమె భోపాల్‌లో ఉన్న సమయంలో ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చి వస్త్రపూర్ ఏరియాలో నివాసం ఉంటున్న అనిల్ లల్వాని(26)‌ ఆన్‌లైన్ పోర్టల్‌లో పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో ఆమె కోసం అనిల్ భోపాల్ వెళ్లాడు. ఆ తర్వాత ఒక రోజు తనను ఢిల్లీ రావాల్సిందిగా కోరడంతో ఆమె భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్లింది. అక్కడ వారం రోజులపాటు కలిసి మెలిసి చెట్టపట్టాలు వేసుకొని తిరిగారు. అదే సమయంలో ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది అని కూడా తెలుస్తోంది.

అయితే ఆ తర్వాత ఆమె తిరిగి భోపాల్ కు వచ్చేసింది. దీంతో తాజాగా ఆమె తన స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు ఆమె అహ్మదాబాద్‌ వచ్చింది. ఇద్దరూ కలసి బర్త్‌డే పార్టీకి వెళ్లారు. అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరగడంతో రెచ్చిపోయిన అనిల్.. ఆమెను కొట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడే ఆమె తీవ్రంగా గొడవ చేయడంతో పెళ్లి చేసుకుంటానని అతడు నమ్మించాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగింది. కావాలని అనిల్ లల్వానీ ఆమెను దూరం పెడుతున్నాడని చెప్పి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అంతేకాకుండా తను బర్త్ డే పార్టీకి తీసుకెళ్లి రేప్ చేశాడని కేసు పెట్టి అతడికి షాక్ ఇచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మోసం చేశాడని…. ఫిర్యాదు చేసింది. అంతటితో ఆగకుండా అతనికి ఇంకా మరికొంతమందితో సంబంధాలు ఉన్నాయని కూడా ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.