లాక్ డౌన్ మనస్తాపంతో… భార్య ఆత్మహత్య యత్నం

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించేస్తుంది. కరోనా వైరస్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమౌతున్నారు. దీంతో ఊరకే ఇంట్లో ఉండి విపరీత ఆలోచనల్లో జనం మునిగితేలుతున్నారు. పనిలేకపోతే పస్తుండాలని మనస్తాపానికి గురౌతున్నారు. ఆకలి భయంతో ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచన చేసి చివరకి అదే పని చేసింది ఓ ఇల్లాలు.

ఆంధ్రప్రదేశ్ లని తూర్పు గోగావరి జిల్లా పెద్దాపురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించి నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నాయి. ప్రజలెవరూ బయటికి రావొద్దని.. ఇళ్లలోనే ఉండాలని చెప్తున్నారు. అయితే ఆ ప్రభావం సామాన్యులు, రోజువారీ కూలీలపై తీవ్రంగా పడింది. రోజుల తరబడి పనులకు వెళ్లకపోతే బతుకుబండి ఎలా నడుస్తుందన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారు.

అయితే తన భర్త కరోనా ప్రభావంతో వారం రోజులుగా పనికి వెళ్లడం లేదు. దీంతో తాము పస్తు ఉండాల్సి వస్తుందేమోనన్న భయంతో భార్య ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పెద్దాపురంలోని వరహాలయ్యపేటకి చెందిన లక్ష్మి, తన భర్తతో కలసి నివసిస్తుంది. అయితే తిండిలేక ప్రాణభయంతోనే లక్ష్మి చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గమనించిన కుటుంబ సభ్యులు లక్ష్మిని ఆస్పత్రికి తరలించారు. వైద్య చికిత్స తర్వాత ఆమెని ఇంటికి పంపించినట్లు వైద్యులు తెలిపారు.