హీరో నితిన్ పుట్టిన రోజున మెగాస్టార్ బహుమతి

హీరో నితిన్ పుట్టిన రోజున మెగాస్టార్ బహుమతి

నేడు హీరో నితిన్ పుట్టిన రోజు కావడంతో విషెష్ అందిస్తూ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. హ్యాపీ బర్త్ డే నితిన్.. మీరు ప్రజాక్షేమం కోసం మీ పర్శనల్ లైఫ్ ఈవెంట్‌ను వాయిదా వేసుకున్నారు. కరోనాపై పోరాడుతున్న యోధుడు అని అనిపించారు. ఇలాంటి పోరాటం ఉంటే కరోనా మన దేశాన్ని స్వాధీనం చేసుకోలేదు. మీకు మీకు కాబోయే భార్య షాలినికి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. ఇక కరోనాకు తన వంతుగా అందరికంటే ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలకు సీఎంలకు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షలు అందించిన నితిన్‌కి ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి.

కాగా మెగాస్టార్ నుంచి తనకు మెగా బర్త్ డే విషెష్ అందడంతో నితిన్ ఆనందానికి అవధులు లేవు.. ‘థాంక్యూ సోమచ్ సార్.. వెరీ స్వీట్ ఆఫ్ యు సార్’ అంటూ రిప్లై ఇచ్చి తన ఆనందాన్ని ఫ్యాన్స్‌తో ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నారు నితిన్.

ఇక నితిన్‌తోనే కాకుండా నితిన్‌కి కాబోయే భార్య షాలిని ఫ్యామిలీతో చిరుకి మంచి రాజకీయ పరంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. షాలిని రెడ్డి తెలంగాణ నాగర్ కర్నూల్‌కి చెందిన డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ షేక్ నూర్జహాన్ కూతురు.

మరోవైపు లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్‌లు లేక ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులు, కళాకారులను ఆదుకునేందుకు చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.)ని నెలకొల్పారు. ఈ ఛారిటీకి ఇండస్ట్రీ తరుపున మంచి స్పందన లభించింది. వరుణ్ సందేశ్ 20 లక్షలు, రవితేజ 20 లక్షలు, శర్వానంద్ 15 లక్షలు, దిల్ రాజు 10 లక్షలు, విశ్వక్ సేన్ రూ. 5 లక్షలు, లావణ్య త్రిపాఠి రూ. 1 విరాళాలు ప్రకటించడంతో వారిని అభినందిస్తూ ట్వీట్స్ చేశారు చిరు.