మాల్ ఏదైనా వస్తువు కొన్న తర్వాత బిల్లింగ్ కోసం క్యూ లో నిలబడే అవసరం లేదు. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొంటే చాలు చెక్ ఇన్ ఛెకౌట్ ఒకేసారి చేయొచ్చంటోంది ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్..అదేంటో చూద్దమా..
అన్ని చెల్లింపులూ మొబైల్ ఫోన్‌తోనే అయిపోతాయి. 2017 ప్రారంభంలో అందుబాటులోకి రానున్న ఈ ఫెసిలిటీ గురించి ‘అమెజాన్ గో’ వీడియోలో వివరించింది.
** ఇక మీదట మనం షాపింగ్ చేయాలనుకుంటే.. అత్యాధునిక మాల్‌లోకి వెళ్లాలి.
** వెళ్లే ముందే మన స్మార్ట్‌ఫోన్‌లో అమెజాన్ గో యాప్ ఓపెన్ చేస్తే ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది.
**ఆ క్యూఆర్ దాన్ని మాల్ ప్రవేశద్వారం వద్ద ఉన్న స్కానర్‌తో స్కాన్ చేయాలి.
**ఆ తర్వాత నేరుగా అక్కడున్న స్మార్ట్ కప్ బోర్డుల వద్దకు వెళ్లి, వాటిలో మనకు కావల్సిన వాటిని ఎంచుకుని, తీసుకోవాలి. మనం తీసుకునే సమయంలోనే అవి మన కార్ట్‌లోకి యాడ్ అయిపోతాయి.
**ఒకవేళ మనం ముందు ఎంపిక చేసుకుని, మళ్లీ వద్దనుకుంటే వెంటనే కార్ట్‌లోంచి ఆ వస్తువు పోతుంది. కొత్తగా ఏవేం తీసుకుని బ్యాగులో వేసుకుంటామో అవి మాత్రమే కార్ట్‌కు యాడ్ అవుతాయి.
** వెళ్లిపోయే సమయానికి కార్ట్‌లో మనం తీసుకున్న వస్తువులన్నీ ఉంటాయి. వాటికి ఎంత మొత్తం అవుతుందో అదంతా కూడా చూపిస్తుంది.
** చెల్లింపు కూడా ఆన్‌లైన్‌లోనే అయిపోతుంది
**అక్కడ మనం ఎవరికీ ఏమీ చూపించకుండానే, బిల్లింగ్ కౌంటర్ వద్ద వేచి ఉండకుండానే నేరుగా బయటకు వెళ్లిపోవచ్చు.
కానీ 2017 వరకు ఈ యాప్ కోసం వెయిట్ చేయాల్సిందే ..