రేవంత్ రెడ్డి ని మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు అరెస్ట్ చేసి, నిర్బంధంలోకి తీసుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో జరిగిన హేతుకరమైన చర్యగా పరిగణించిన హైకోర్టు డీజేపీ పైన అక్షింతలు చల్లినంత పనిచేసి, పూర్తి స్థాయి రిపోర్టుని అందించవలసిందిగా కఠినంగానే ఆర్డర్ చేసింది. ఈ అరెస్టు వ్యవహారంలో దిద్దుబాటు చర్యలకు రాష్ట్ర ఎన్నికల సంఘం దిగింది.ఈ దిద్దుబాటు చర్యలో భాగంగా వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణ పైన బదిలీ వేటు వేసి, హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేసింది.
తాను ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి విధుల్లో పాల్గొనరాదని ఆదేశాలు జారీ చేసి, ఆమె స్థానంలో అవినాష్ మహంతి ని ఎస్పీగా నియమించింది. ఇప్పటికే హైకోర్ట్ డీజీపీ సమర్పించిన నివేదిక మీద అసంతృప్తితో ఉండగా, రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టుకి పురిగొల్పిన కారణాలేమిటో సమగ్ర నివేదికగా సమర్పించాలని డీజేపీ ని ఆదేశించింది. ఏదేమైనా కేసీఆర్ ప్రభుత్వం ఉసిగొల్పిన చర్యగా రేవంత్ రెడ్డి అరెస్టుని భావిస్తున్న ప్రజల మద్దతు తో పాటు సానుభూతి కూడా రేవంత్ రెడ్డి కి దక్కేలా ఉన్నాయి.