మా గడ్డ మీద నిలబడి నీళ్ల గురించి మాట్లాడుతున్నావేం చంద్రబాబు – కేసీఆర్ హెచ్చరిక

KCR Serious Comments On Chandrababu

నేటితో ముగియనున్న తెలంగాణ ఎన్నికల ప్రచార జోరులో కేసీఆర్ తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌ లోని ప్రచారంలో, ప్రజకూటమి పైన నిప్పులు చెరిగారు. కేసీఆర్ ప్రసంగిస్తూ, “తెలంగాణ రాష్ట్రము కోసం 58 యేళ్లుగా పోరాడం, ఎంతో నష్టపోయాం, ఎందరో బిడ్డలు అమరులయ్యారు. తెలంగాణ బిడ్డల పోరాట కృషి వలన సంపాదించుకున్న రాష్ట్రం ఇది. అంతేకానీ, ఎవడో బిస్కెట్ లాగ విసిరేస్తే వచ్చింది కాదు. తెలంగాణాలో నేను చల్లిన విత్తనాలు ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నాయి. వాటి ఫలాలు అందరికి అందాలంటే ప్రజలు ఈసారి కూడా కారు గుర్తుకే ఓటేసి, మమ్మల్ని గెలిపించాలి. ప్రజలకు నేను చెప్పేది ఒక్కటే, కస్టపడి సాధించుకున్న తెలంగాణను దెయ్యాల పాలు చేయకండి. రాష్ట్రం అంతా పచ్చగా ఉండాలా. అక్కడ కోదాడ సభలో రాహుల్ గాంధీ, చంద్రబాబు ఏమి చెప్తున్నారో ఎరుకేనా? కృష్ణ నదిలో నీళ్లు లేవంటా, మన గోదావరి నీళ్లను పంచుకోవాలంటా, దానికి మల్లి కాంగ్రెస్ తొత్తులు తలూపుడు.

kcr-chandrabbabbu

మన నీళ్ల గురించి ఎవరైనా మాట్లాడితే ఊరుకునేది లేదు. మన హరీష్ రావు పళ్ళు పట పట కొరకాల్సిందే. చంద్రబాబు ప్లాన్ ఏమిటంటే తెలంగాణను పాలించడానికి ఒక కీలుబొమ్మ లాంటి సీఎం కావాలి. అందుకే నేను తప్ప ఇంకెవరైనా సీఎం కావాలని వేల కోట్ల రూపాయలను తెచ్చి, ఆంధ్ర నేతలను దించాడు ఈ చంద్రబాబు. ఆ కాంగ్రెస్ కి రెండు రాష్ట్రాల్లో అధికారం పోయిందన్న అక్కసు ఉంది. ఇటు చూస్తేనేమో కేసీఆర్ కొరకరాని కొయ్యలా తయారయ్యాడని వాళ్ళకి బాధ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేను అడుగు వేసినప్పుడు, వీడేమి చేస్తాడులే అని అనుకున్నారు వాళ్ళు. కానీ, ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యింది. నా ప్రాణం ఉన్నంతవరకూ తెలంగాణను ఎవ్వరికీ బానిస కానివ్వను” అని శపథం చేసినట్లుగా ప్రసంగించారు కేసీఆర్.

kcr

అంతా బాగానే ఉన్నా, కేసీఆర్ తన మాటలతో గారడీ చేస్తున్నా, విజయం పట్ల పూర్తి నమ్మకం లేదనే అభిప్రాయం కేసీఆర్ మాటలు విన్న ప్రజల్లో కలుగుతున్నదని తెలుస్తుంది. ఎంతసేపటికి ప్రజాకూటమిని విమర్శించడమే పనిగా పెట్టుకున్న కేసీఆర్, తన పథకాలు ప్రజల్లోకి చొచ్చుకుపోయాయో లేదో అనేది విస్మరించినట్టుగా అనిపిస్తుంది. కొన్ని సర్వేలు తెరాస కి అనుకూలంగా ఉండడంతో, కేసీఆర్ లో మునుపటి ఉత్సాహం కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఏ హామీ ని కేసీఆర్ నెరవేర్చలేదని అందరికి తెలిసినదే. ఇంకా తొమ్మిది నెలల గడువుండగానే ముందస్తుకి వెళ్లడం అనేది కూడా ప్రజలకు ద్రోహం చేసి, మరోసారి తెలంగాణ అధికార పీఠాన్ని అధిరోహించాలనే తంత్రంలో భాగమే. అటు నిరుద్యోగ యువత వయస్సు పైబడి, ఏజ్ బార్ అవుతూ, సర్కార్ నౌకరీ చేయాలనే ఆశ తో, అటు ప్రైవేటు జాబులకు వెళ్లకుండా, ఏళ్ళకి ఏళ్ళు అప్పు చేసి తెచ్చిన సొమ్ముతో బతుకు వెళ్లదీస్తుంటే, కనీసం వరుస నోటిఫికేషన్లు కూడా ఇవ్వకుండా, విద్యార్థుల జీవితాలని ఆగం చేస్తూ, తన కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చుకొని, వందల కోట్ల ప్రజల సొమ్ముతో ప్రగతి భవన్ నిర్మించుకొని, సచివాలయం కి కూడా వెళ్లడం ఇష్టం లేకుండా.

chandrababu-kcr

తన రాజసౌధంలోనే నియంతలా రాష్ట్రాన్ని నడుపుతున్న కేసీఆర్ కి, తమ కొడుకుల, కూతుర్లకి ఉద్యోగాలు ఇవ్వకుండా, వారి జీవితాలతో చదరంగం ఆడుతున్న కేసీఆర్ కి ప్రజలు కేవలం పెన్షన్లు ఆశించి, ఓట్లు వేసి గెలిపిస్తారా? ప్రాజెక్టులు లేనప్పుడు తెలంగాణాలో ఆశించిన స్థాయిలో జీవన పరిస్థితులు లేదన్న మాట నిజమే అయినప్పటికీ, కేసీఆర్ నాలుగున్నరేళ్ల పాలన తరువాత ఏమైనా మారిపోయాయా? రైతు బంధు పథకం ద్వారా రెండు ఎకరాలున్న రైతుకి ఒరిగేది కంటే, పదుల సంఖ్యలో ఎకరాలున్నఆసామికి కలిగే ఫలితమే ఎక్కువ. సరైన ఇల్లు లేక పెరుగుతున్న అద్దెలతో సతమతమవుతున్న బడుగు జీవులకు డబల్ బెడ్ రూమ్ ఇల్లులు ఇవ్వకపోగా, ఆ ఇచ్చిన నాసిరకమైన ఇళ్ళని కూడా తమ కార్యకర్తలకే ఇచ్చారనే అపనింద ప్రజలలో నలగడం లేదా? ఇవన్నీ పరిగణలోకి తీసుకొని, రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరికి అధికారం కట్టబెట్టనున్నారో అనేది తేల్చలేని ప్రశ్న అయ్యింది.