కరోనా కి కారణం చైనా ఆహారపు అలవాట్లేనా ?

కరోనా కి కారణం చైనా ఆహారపు అలవాట్లేనా ?

చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తుంది. కరోనా వైరస్ పుట్టింది చైనాలో… కరోనా వైరస్ ని ప్రపంచానికి ఇచ్చింది చైనా వెకిలి తిండి. ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా తినడం ద్వారా తమ ఆహారపు అలవాట్ల నుంచి కొత్త కొత్త రోగాలను ప్రపంచానికి పరిచయం చేస్తుంది చైనా అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇప్పుడు చైనా కారణంగానే కరోనా వైరస్ తీవ్రంగా ఉందీ అనే విషయం స్పష్టంగా అర్ధమైంది. ఒక్క మనిషిని మినహా అన్ని జంతువులను పురుగు, పుట్రా ఇలా ప్రతీ ఒక్కటి తినడం వాళ్లకు అలవాటు.

గబ్బిలం చూస్తేనే చిరాకు గా ఉంటుంది. అలాంటి గబ్బిలం వాళ్లకు రుచిగా ఉంటుంది. దాని పులుసు కి మంచి డిమాండ్ ఉంటుంది. ఎగబడి తినడం వాళ్లకు మాత్రమే తెలిసిన విద్యగా చెప్పుకోవచ్చు. అక్కడి రెస్టారెంట్ లు కూడా దీనిని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఏదైనా చిన్న కార్యక్రమం జరిగితే అక్కడ గబ్బిలం సూప్ ఉంటుంది. దీని నుంచే కరోనా బయటకు వచ్చింది అంటున్నారు.వాళ్ళ వెకిలి అలవాట్లే ఇప్పుడు ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఊహాన్ ల్యాబ్ లో కరోనా లీక్ అయింది అంటున్నారు. గబ్బిలాలు తిని ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది చైనా. ఈ వైరస్ ఎప్పుడు అదుపులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీనితో ప్రపంచ దేశాలు అన్నీ కూడా చైనానే దోషిగా చూస్తున్నాయి.