తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్ కారణంగా కీలక నిర్ణయం తీసుకుంది టీడీపీ పార్టీ. గుడివాడ, అరకు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ఖరారు చేసింది టీడీపీ. గుడివాడ ఇన్ఛార్జీగా వెనిగండ్ల రాము, అరకు ఇన్ఛార్జీగా దొన్ను దొరను చంద్రబాబు నియమించారు.
గుడివాడ టిక్కెట్ ఆశించిన ప్రస్తుత ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావుకు భంగపాటు కలిగింది. వెలమ కుటుంబానికి సీటు ఇవ్వకూడదనే తరుణంలోనే, గుడివాడ ఇన్ఛార్జీగా వెనిగండ్ల రామును చంద్రబాబు నాయుడు నియమించారు. అరకు అసెంబ్లీ సెగ్మంట్ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన కిడారి శ్రావణ్ కుమార్ ను అరకు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అధ్యక్షునిగా నియామకం చేశారు.