టికెట్​ కోసం ఇంకా BRS నేతల ప్రయత్నాలు..

Efforts of BRS leaders for ticket.
Efforts of BRS leaders for ticket.

రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ 105 స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ.. పలువురు నేతలు ప్రగతి భవన్​కు పరుగులు తీస్తున్నారు.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో ఇందులో భాగంగానే పలువురు నేతలు కలిశారు. కవితను కలిసిన వారిలో నేతలు ఎన్‌.సంజయ్‌, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రేఖా నాయక్‌, సునీతా లక్ష్మారెడ్డి,ఎల్‌.రమణ, చంద్రావతి, బొంతు రామ్మోహన్‌, మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఉన్నారు. మంత్రి హరీశ్‌ రావును కూడా పలువురు నేతలు కలిసినట్లు తెలుస్తోంది.

ఆశావహులను కలిసిన అనంతరం ఎమ్మెల్సీ కవిత,మంత్రి హరీశ్‌ ప్రగతిభవన్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో ఎంతమందికి టికెట్లు దక్కే అవకాశముంది? మొదటి జాబితాలో ఉండని నియోజకవర్గాలేమిటి? అనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశవుతోంది. ఇక ఎవరికి ఛాన్స్ వస్తుందో.. కేసీఆర్ ఎవరికి హ్యాండ్ ఇస్తారో మరి కాసేపట్లో తెలిసిపోనుంది.