Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెరుపు ఎంతగా మిరుమిట్లు గొలిపినా ఉండేది కొద్దిసేపే. అలాగే అయ్యింది ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో విశాల్ పరిస్థితి. ఆయన ఆర్కే నగర్ బరిలోకి దిగడం ఓ షాక్ అయితే అంతకు మించిన షాక్ విశాల్ కి ఇచ్చింది ఎన్నికల కమిషన్. విశాల్ నామినేషన్ ని తిరస్కరించింది. నామినేషన్ వేసేటప్పుడు అభ్యర్ధికి మద్దతుగా 10 మంది స్థానిక ఓటర్లు సంతకం చేయాల్సి ఉంటుంది. అలా విశాల్ నామినేషన్ పత్రాల మీద సంతకం చేసిన ఇద్దరు అది తమ సంతకం కాదని రిటర్నింగ్ అధికారి ముందు చెప్పడంతో విశాల్ నామినేషన్ తిరస్కరిస్తున్నట్టు సదరు అధికారి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ ఇద్దరినీ అధికార పక్షం తరపు వాళ్ళు బెదిరించారని విశాల్ వాదిస్తున్నారు.
ఇక జయ మేనకోడలు దీపా జయకుమార్ నామినేషన్ కూడా తిరస్కరణకు గురి అయినట్టు తెలుస్తోంది. నామినేషన్ పత్రాన్ని అసంపూర్తిగా రాసినందునే ఈ పరిస్థితి వచ్చిందట. ఆస్తుల డిక్లరేషన్ కి సంబంధించిన 26 వ ఫామ్ లోని కొన్ని కేటగిరి లను ఆమె పూర్తి చేయకుండా వదిలేశారు. మొత్తానికి ఆర్కే నగర్ బై ఎలక్షన్స్ లో సంచలనం అనుకున్న ఇద్దరు నామినేషన్ స్థాయిలోనే ఆగిపోవడం విశేషం.